ఆ షోకు నాగబాబు రెమ్యున‌రేష‌న్ ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

-

నాగబాబు చాలా కాలంగా ‘జబర్దస్త్’ కామెడీ షోకి న్యాయ నిర్ణేతగా వ్యవహరిస్తూ వస్తున్నారు. ఇటీవల ఆయన ఈ షో నుంచి తప్పుకుని, జీ తెలుగులో మరో కార్యక్రమానికి వెళ్లిపోయారు. జబర్దస్త్ నుంచి వచ్చిన తర్వాత మల్లెమాల ప్రొడక్షన్‌పై వరస విమర్శలు చేసిన నాగబాబు.. జీ తెలుగులో వరస ప్రోమోస్‌లో కనిపిస్తున్నాడు. అయితే నాగబాబు ఉన్నా లేకున్నా కూడా జబర్దస్త్ రేటింగ్ మాత్రం అలాగే ఉంది. అయితే ఆయన ఎందుకు మానేసి వెళ్లిపోయారనేది చర్చనీయాంశమైంది. ఆయన మానేయడానికి ప్రధాన కారణం పారితోషికమేననే టాక్ ఫిల్మ్ నగర్లో బలంగా వినిపించింది.

నాగబాబు కూడా ఒకానొక సందర్భంలో మాట్లాడుతూ, తన స్థాయికి తగిన పారితోషికం కాకపోయినప్పటికీ ‘జబర్దస్త్’ కామెడీ షోలో చేశానని చెప్పారు. ఇక ఇప్పుడు జీకి వచ్చిన నాగబాబుకు ఇక్కడ అదిరిపోయే రెమ్యునరేషన్ ఆఫర్ చేసినట్లు తెలుస్తుంది. ఈటీవీలో వచ్చేదాని కంటే కూడా మూడు రెట్లు ఇక్కడ ఇస్తున్నారని.. అందుకే నాగబాబు ఛానెల్ మార్చేసాడని ప్రచారం జరుగుతుంది. ఇక ఇప్పుడు జీ తెలుగులో చేస్తున్న కార్యక్రమానికి గాను ఆయనకి పారితోషికంగా నెలకి 30 లక్షల రూపాయలను ఫిక్స్ చేసినట్టుగా సమాచారం. మ‌రో విష‌యం ఏంటంటే.. 30 లక్షలతో పాటు సెట్‌లో అలాగే బయట కూడా వీఐపీ సౌకర్యాలు అందుకుంటున్నాడని తెలుస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news