కేసీఆర్ వైద్య పరీక్షలు పూర్తి.. వైద్యులు ఏమన్నారంటే ?

సీఎం కేసీఆర్ కి వైద్య పరీక్షలు పూర్తి అయ్యాయి. దీంతో మళ్లీ ఎర్రవెల్లి ఫాం హౌస్ కి బయలుదేరి వెళ్లారు సీఎం కేసీఆర్. కేసీఆర్ వ్యక్తిగత వైద్యుడు ఎంవీ రావు మాట్లాడుతూ సీఎం కేసీఆర్ కు సాధారణ పరీక్షలు నిర్వహించామని సీటీ స్కానింగ్ , నార్మల్ గానే వచ్చిందని ముఖ్యమంత్రి పూర్తి ఆరోగ్యంగా ఉన్నారని అన్నారు.

సీఎం కేసీఆర్ ఊపిరితిత్తులు సాధారణంగా వున్నాయని, ఎటువంటి ఇన్ఫెక్షన్ లేదని డాక్టర్లు తెలిపారు. సాధారణంగా నిర్వహించే రక్త పరీక్షల నిమిత్తం కొన్ని రక్త నమూనాలను సేకరించారు. రక్త పరీక్షలకు సంబంధించిన రిపోర్ట్ రేపు రానున్నాయి. సీఎం కేసీఆర్ ఆరోగ్యం నిలకడగా ఉందని, త్వరగా కోలుకుంటారని పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు వెల్లడించారు. సీఎం కేసీఆర్ వెంట మంత్రి కేటీఆర్, ఎంపీ జె సంతోష్ కుమార్ ఇతర కుటుంబ సభ్యులున్నారు.