కరోనా వైరస్ కి చికిత్స చేస్తున్న వైద్యులు ఇప్పుడు నానా ఇబ్బందులు పడుతున్నారు. కరోనా చికిత్స చేస్తున్న వైద్యులకు ఇప్పుడు సదుపాయాలు కనపడటం లేదు. ఒక రకంగా చెప్పాలి అంటే వాళ్ళు నరకం చూస్తున్నారు అనేది వాస్తవం. కరోనా చికిత్స చేస్తూ ప్రజలకు విముక్తి కల్పిస్తున్న వైద్యుల ప్రాణాలకు మాత్రం ఏ రక్షణ లేకుండా పోయింది అనేది వాస్తవం. కరోనా కేసుల సంఖ్య రోజు రోజుకి పెరుగుతుంది.
దీన్ని కట్టడి చేయడం అనేది ప్రపంచంలోని ప్రతీ వైద్యుడికి ఇప్పుడు నరకంగా మారింది. అయితే వారికి మాత్రం సౌకర్యాలు అసలు లేవు. కోటు, హెల్మెట్, మాస్క్ ఇలా ఏది చూసినా లేవు అనేది వాస్తవం. కరోనా వైరస్ లాంటి ప్రమాదకర రోగంతో పోరాడుతున్న వైద్యులకు కూడా రక్షణ లేకపోవడం అనేది నిజంగా ఆందోళన కలిగించే విషయం. బండి హెల్మెట్ లు, రైన్ కోట్స్ వేసుకుని చికిత్స చేస్తున్నారు.
ఇటలీ, అమెరికా, ఫ్రాన్స్ లాంటి దేశాల్లో కూడా ఇప్పుడు వైద్యులకు సౌకర్యాలు దాదాపుగా లేవు అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మన దేశంలో కూడా ఇలాగే ఉంది ఇప్పుడు. పశ్చిమ బెంగాల్ సహా పలు ప్రాంతాల్లో వైద్యులు చాలా ఇబ్బంది పడుతున్నారు. అమెరికాలో వైద్యులకు కూడా కరోనా వైరస్ సోకడం, ఇటలీలో కూడా వైద్యులు కరోనా సోకి చనిపోవడంతో ఇప్పుడు ఎం చెయ్యాలో అర్ధం కావడం లేదు. మన దేశంలో ఆ పరిస్థితులు రాకుండా చూడాలి ప్రభుత్వాలు.