విజయకృష్ణ ఇంటిపై మహేష్ బాబుకు హక్కు ఉందా? లేదా..?

-

నవంబర్ 15వ తేదీన సూపర్ స్టార్ కృష్ణ మరణించిన తర్వాత అందరి దృష్టి ఆయన ఆస్తులపై పడిందని చెప్పవచ్చు. మొదటి భార్య ఇందిరా దేవి ఉండగానే రెండవ వివాహం చేసుకున్న కృష్ణ మొదటి భార్యను కాదని విజయనిర్మల దగ్గరే ఉన్నారు.. కానీ ఇప్పుడు విజయనిర్మల, ఇందిరా దేవి, కృష్ణ అందరూ చనిపోయారు. అయితే ఇప్పుడు ఇక్కడే వచ్చింది అసలు చిక్కంతా.. మహేష్ బాబు తండ్రి కృష్ణ, విజయనిర్మల ఇద్దరూ కష్టపడి చాలా డబ్బు పోగు చేశారు. అయితే ఆస్తులు, అంతస్తులు ఇప్పుడు నరేష్ కి వెళ్తాయా? లేక మహేష్ బాబుకు వెళ్తాయా? అనే సందేహం మొదలైంది.

నిజానికి కృష్ణ ఆస్తికి ఎవరు అవునన్నా కాదన్నా.. ఆయన పిల్లలైనా రమేష్ బాబు, మహేష్ బాబు మాత్రమే వారసులు . అయితే రమేష్ బాబు కన్నుమూసిన కూడా ఆయన కుటుంబానికి కృష్ణ ఆస్తుల్లో వాటా ఉండాల్సిందే.అందుకే ఇలా ఎవరి వాటా వారికి ఇవ్వాల్సిందే. కానీ వాళ్ళకి మొదట్లోనే కృష్ణ ఎవరికి ఇవ్వాల్సిన వాటా వారికి ఇచ్చేశారు. ఆ తర్వాత కూడా విజయనిర్మలతో కలిసి చాలా ప్రాపర్టీని కొనుగోలు చేశారు కృష్ణ. ఈ క్రమంలోనే ప్రస్తుతం నానక్ రామ్ గూడా లో ఉన్న ఇంటి గురించి.. అలాగే ఊటీలో ఉన్న మరొక బంగ్లా గురించి ప్రతి ఒక్కరూ మాట్లాడుకుంటున్నారు. దాదాపు పది ఎకరాలకు పైగా స్థలంలో వివాహం తర్వాత కృష్ణ విజయనిర్మల కలసి ఒక ఇంటిని నిర్మించారు.

అయితే అందులో ఇప్పుడు విజయనిర్మల కొడుకు నరేష్ అలాగే విజయనిర్మల సోదరులు నివసిస్తున్నారు. ఇన్నాళ్లపాటు తండ్రి ఉన్నాడు కాబట్టి ఆస్తుల గురించి మహేష్ బాబు పెద్దగా ఆలోచించలేదు. ఇప్పుడు తండ్రి కూడా పోయాడు.. ఆ బంగ్లా మరియు ఆస్తులు ఎవరికి చెందాలి అనేది ప్రశ్న. నరేష్ ఆధీనంలో ఉన్న ఆస్తులను మహేష్ బాబు కచ్చితంగా అడిగే ప్రసక్తి లేదు. అలాగని వదిలేసి అన్ని అతడికి అప్పచెప్పేస్తే.. ఇక రమేష్ కుటుంబానికి అన్యాయం జరిగే అవకాశం ఉంది. ఇలాంటి తరుణంలోనే అటు నరేష్ కి పూర్తి ఆస్తి ఇవ్వలేడు.. అలాగని ఇటు రమేష్ బాబు పిల్లలకు అన్యాయం చేయలేడు.. మొత్తానికైతే పెద్దల సమక్షంలోనే ఈ ఆస్తి తగాదాలు వీడిపోవాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news