భారత దేశంలో చాలా మంది ఎనిమియా సమస్యతో బాధపడతారు. 50 శాతం మంది మహిళలు ఎనిమియా సమస్యతో బాధ పడతారని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. మన ఒంట్లో హెమోగ్లోబిన్ 12gm/dl కంటే తక్కువ ఉంటే ఎనిమియా అని అంటారు .మహిళల్లో ఎనిమియా సమస్య ఎక్కువగా ఉంటుంది.
మహిళల్లో ఎనిమియా రావడానికి కారణాలు:
ఇన్ఫెక్షన్స్
పోషకపదార్థాలు సరిగ్గా తీసుకోకపోవడం
హెవీ మరియు అబ్నార్మల్ పీరియడ్స్
ప్రెగ్నెన్సీ
ఈ కారణాల వల్ల హిమోగ్లోబిన్ తగ్గుతుంది దానితోనే ఎనిమియా వస్తుంది కాబట్టి మహిళలు సరైన పోషక పదార్థాలు తీసుకోవడం.. ప్రెగ్నెన్సీ, పీరియడ్ లో జాగ్రత్తగా ఉండాలి.
ఎనిమియా యొక్క లక్షణాలు:
అయితే ఎనిమియా లక్షణాలు మారుతూ ఉంటాయి కానీ ఈ లక్షణాలు చాలా కామన్ గా వస్తాయి.
నీరసం
బలహీనంగా ఉండడం
చర్మం పాలిపోవడం
ఇర్ రెగ్యులర్ హార్ట్ బీట్
శ్వాసతీసుకోవడంలో సమస్య
తలనొప్పి
చాతిలో నొప్పి
చేతులు చల్లబడటం
నెలసరి వలన ఎనిమియా సమస్య వస్తుందా..?
హెవీ పిరియడ్స్ వలన ఇబ్బందులు వస్తాయి. అందుకని గైనకాలజిస్టును సంప్రదిస్తూ ఉండాలి పీరియడ్స్ లో చాలా రక్తం పోతు ఉంటే దీని వలన రెడ్ బ్లడ్ సెల్స్ ఎక్కువగా కోల్పోతారు. బాడీ లో ప్రొడ్యూస్ అయ్యే దానికంటే ఎక్కువ కోల్పోవడం జరుగుతుంది దీంతో ఐరన్ యొక్క శాతం తగ్గుతుంది. దీని మూలంగా హెమోగ్లోబిన్ ని బాడీ ప్రొడ్యూస్ చేయలేదు ఎక్కువగా రక్తం పోవడం వలన చాలామంది మహిళలు ఎనిమియా సమస్యతో బాధపడుతూ ఉంటారు ప్రతి నెల ఇలా రక్తం పోవడం వల్ల రెడ్ బ్లడ్ సెల్స్ తగ్గిపోతూ ఉంటాయి అందుకని ఇలాంటప్పుడు ఎక్కువ ఐరన్ వుండే ఆహారాన్ని తీసుకుంటూ ఉండాలి అప్పుడు ఐరన్ లోపం నుండి బయట పడవచ్చు.