ఓర్ని.. స్మోకింగ్ వల్ల మెడపై త్వరగా ముడతలు వస్తాయట..?

-

వయసు పెరిగితే ఎలాగో ముఖం మీద ముడతలు వస్తాయి.. కానీ ఎప్పుడో వృద్ధాప్యంలో రావాల్సిన ముడతలు ముప్పైకే వస్తే.. చాలామందికి మెడ భాగం సాగిపోయి ముడతలు వచ్చినట్లు కనిపిస్తాయి. ఫేస్ బాగున్నా..ఇలా మెడ దగ్గర స్కిన్‌ సాగిపోతో చూసేవాళ్లకు వీళ్లకు ఏదో ఎక్కవు ఏజ్‌..ఫేస్‌ ఎలాగోలా కవర్ చేశారు కానీ..మెడ దగ్గర దొరికిపోయారు అనుకుంటారు. మనం చేసే తప్పుల వల్లే ఇలాంటి ముప్పులు జరుగుతాయి. సూర్యరశ్మి వల్ల చర్మం దెబ్బతినడం, పొగతాగడం, సరైన ఆహారం తీసుకోకపోవడం, డీహైడ్రేషన్‌, కాలుష్యం, ఫేషియల్‌ ఎక్స్‌ప్రెషన్స్‌, నిద్ర వంటివి ఈ సమస్యకు కారణాలుగా చెప్పవచ్చు. మెడ మీద చర్మం సున్నితంగా ఉంటుంది. అందుకే వృద్ధాప్య సంకేతాలు ఇక్కడి నుంచే ప్రారంభమవుతాయి. అయితే ఈ సమస్యను దూరం చేసుకోవడానికి కొన్ని చిట్కాలు ఉన్నాయి అవేంటంటే..

సన్‌స్క్రీన్‌

సన్ డ్యామేజ్ మెడ చుట్టూ ఉండే చర్మంపై గీతలు, ముడతల సమస్యను ఎక్కువ చేస్తుంది. మెడకు కనీసం SPF 30 రేటింగ్ ఉన్న సన్‌స్క్రీన్‌ను ఎల్లప్పుడూ అప్లై చేయాలి. ఇవి మెడపై ఇప్పటికే కనిపించే ముడతలను తగ్గించి, సూర్యరశ్మి వల్ల కలిగే నష్టాన్ని నివారిస్తాయి. సన్‌స్క్రీన్ వాడితే కొత్త నెక్ లైన్‌లు కనిపించకుండా చేస్తుంది. అదే సమయంలో అవసరమైన UV రక్షణను కూడా అందిస్తుంది.

మాయిశ్చరైజింగ్ మాస్క్‌లు కూడా ఉపయోగపడతాయి. ఇవి చర్మాన్ని మృదువుగా చేస్తాయి.. చర్మం రకాన్ని బట్టి కొబ్బరి, ఆర్గాన్, ఆలివ్, జోజోబా లేదా గ్రేప్సీడ్ నూనెను ఉపయోగించవచ్చు. మెడికేషన్ బాడీ బటర్స్ లేదా మాయిశ్చరైజర్స్ కూడా మంచివి. చర్మ రకానికి సరిపోయే పారాబెన్ లేని సన్‌స్క్రీన్‌తో మెడ సున్నితమైన చర్మానికి మేలు చేస్తుంది.

వ్యాయామం

మెడపై కనిపించే ముడతలను తగ్గించడానికి వ్యాయామం చేయాలి. మెడకు వ్యాయామం చేయడం వల్ల కండరాలు బలపడతాయి. ఈ కండరాలు బిగుతుగా మారడంతో, అవి మెడ ప్రాంతంలోని చర్మంపైకి లాగి, ఏవైనా గీతలు లేదా ముడతలు సున్నితంగా కనిపించేలా చేస్తాయి. రెగ్యులర్ వ్యాయామం కూడా మెడపై కొత్తగా గీతలు, ముడతలు ఏర్పడకుండా చేస్తుంది.

ఆహారం

అన్నింటకంటే ముఖ్యమైనంది ఆహారం.. కూరగాయలు, పండ్లతో కూడిన ఆహారం తప్పనిసరి. అవి ఆరోగ్యకరమైన చర్మానికి అవసరమైన ఖనిజాలు, విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లను అందిస్తాయి. ముఖ్యంగా తీసుకోవాల్సిన ఆహారపదార్థాల్లో చేపలు, సోయా ఉంటాయి. అదే విధంగా రోజుకు కనీసం 8-10 గ్లాసుల నీరు తాగాలి.

స్మోకింగ్ మానేయాలి

పొగ తాగేవారిలో వృద్ధాప్య ఛాయలు ముందుగానే కనిపిస్తాయట. అమ్మా…అసలు ఈ స్మోకింగ్‌ వల్ల టెన్షన్‌ ఫ్రీ అవ్వొచ్చు కానీ…. వీరి మెడ, ముఖంపై ఉన్న సున్నితమైన చర్మం పొలుసులుగా మారుతుంది. స్మోకింగ్ మానేసిన తర్వాత ఈ సమస్య చాలా వరకు తగ్గుతుంది.

లేజర్‌ ట్రీట్మెంట్‌ ద్వారా కూడా కొలాజెన్‌ను టైట్‌ చేయొచ్చు. కాకపోతే ఇది ఖర్చుతో కూడుకున్న పని.

Read more RELATED
Recommended to you

Latest news