కరోనా రోగులలో కేవలం 0.29% మాత్రమే వెంటిలేటర్లలో ఉన్నారు అని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖా మంత్రి హర్షవర్ధన్ వివరించారు. 1.93% మంది మాత్రమే ఐసియులో ఉన్నారు అని ఆయన కాసేపటి క్రితం వివరణ ఇచ్చారు. 2.88% కేసులు మాత్రమే ఆక్సీజన్ తో ఉన్నాయని చెప్పారు. గత 24 గంటల్లో 9 లక్షల మందికి కరోనా నిర్ధారణ పరీక్షలను నిర్వహించామని ఆయన వెల్లడించారు.
ఢిల్లీలో కరోనతో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం మంత్రులతో నిర్వహించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. దేశంలో కరోనా కేసులు నిన్న కూడా 76 వేలకు పైగా వచ్చాయి. అత్యధికంగా గత మూడు రోజుల నుంచి వస్తూ ఉన్నాయి. కరోనా కట్టడి విషయంలో పరిక్షల సంఖ్యను పెంచుతున్నా సరే రోజు కేసులు పెరుగుతూ ఉన్నాయి.