ప్రజల తరుపున పోరాడాలని కోరుకునే శక్తులు దేశంలో ద్వేషం విషాన్ని వ్యాప్తి చేస్తున్నాయని కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ఆరోపించారు. భావ ప్రకటనా స్వేచ్ఛ ముప్పు పొంచి ఉందని ఆమె అన్నారు. ప్రజాస్వామ్యం నాశనం అవుతోందని ఆవేదన వ్యక్తం చేసారు. భారతదేశ ప్రజలు, మన గిరిజనులు, మహిళలు, యువత నోరు మూసుకుని ఉండాలని వారు కోరుకుంటారని సోనియా ఆరోపణలు చేసారు.
మన ప్రజాస్వామ్యం & రాజ్యాంగం ముప్పులో ఉంది. స్వాతంత్య్రం వచ్చిన 75 సంవత్సరాల తరువాత మన దేశం ఇంత కఠినమైన పరిస్థితిని ఎదుర్కొంటుందని మహాత్మా గాంధీ, జవహర్ లాల్ నెహ్రూ, బిఆర్ అంబేద్కర్ సహా మన పూర్వీకులు ఎవరూ ఊహించలేదని సోనియా గాంధీ అన్నారు. నేడు ఆమె దేశ ప్రజలను ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేసారు.