పురుషుల కంటే స్త్రీలకే బుర్ర బాగా పనిచేస్తుందని తేల్చిన శాస్త్రవేత్తలు..!!

-

బేసిక్‌గా మగవాళ్లకంటే..ఆడవారికే తెలివి తేటలు ఎక్కువగా ఉంటాయి.. కానీ ఈ నిజాన్ని అబ్బాయిలు అంత ఈజీగా ఒప్పుకోరు.. ఎవరో మేధావులైన పురుషులు మాత్రమే గ్రహించగలుగుతారు..సరే ఈ జనరలైజ్‌ స్టేట్‌మెంట్స్‌ ఎందుకు ఇదే విషయాన్ని సైంటిఫిక్‌గా ప్రూవ్‌ చేశారు శాస్త్రవేత్తలు.. ఆడవారి జ్ఞాపకశక్తి మీద చేసిన ఒక పరిశోధనలో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. పురుషుల్లో కంటే మహిళల మెదడు వేగంగా, చురుకుగా ఉంటుందని నార్వేకు చెందిన పరిశోధకులు తేల్చారు.
మహిళలు 50 ఏళ్ల క్రితం నాటి పదాలను కూడా గుర్తుంచుకో గల సామర్థ్యాన్ని కలిగి ఉంటారని శాస్త్రవేత్తలు తెలిపారు. నార్వేలోని బెర్గెన్ యూనివర్సిటీలో నిర్వహించిన పరిశోధనలో ఈ విషయం వెల్లడైంది. ఈ బృందం పురుషులు, మహిళల మానసిక నైపుణ్యం తెలుసుకోవడం కోసం గత కొన్ని సంవత్సరాల నుండి డేటాను సేకరించింది.
ఆ డేటాను విశ్లేషించింది. ఈ మెటా విశ్లేషణలో దాదాపు 3.50 లక్షల మంది డేటాను తీసుకున్నారు. ఇప్పటి వరకు నిర్వహించిన డేటా రీసెర్చ్‌లో మహిళలకు అనర్గళంగా మాట్లాడే నైపుణ్యాలు ఎక్కువగా ఉన్నాయని తేలింది. అందుకేనేమో వాదనలో వీరి తర్వాతే ఎవరైనా..!!

కారణం అదేనా..?

స్త్రీలు పురుషుల కంటే మెరుగైన జ్ఞాపకశక్తిని కలిగి ఉంటారు. ఒక నిర్దిష్ట అక్షరం లేదా వర్గంతో ప్రారంభమయ్యే పేర్లు, పదాలను కనుగొనడంలో లేదా గుర్తుంచుకోవడంలో మహిళలు మెరుగైన స్థానంలో ఉన్నారు. మహిళల్లో మెదడులోని కార్టెక్స్ , లింబిక్ వ్యవస్థలో ఎక్కువ రక్త ప్రవాహం ఉంటుంది.. దీనివలన పురుషుల మెదడు కంటే స్త్రీల మెదడు చురుకుగా ఉంటుందని పరిశోధకులు తేల్చారు. అంతేకాదు వాసనలు గుర్తుపెట్టుకోవడం వంటి ఇంద్రియ శక్తి కూడా మహిళల్లో అధికంగా ఉంటుందని ఈ అధ్యయనం పేర్కొంది.
స్వీడన్‌లోని కరోలిన్‌స్కా ఇన్‌స్టిట్యూట్‌కి చెందిన మరో పరిశోధన ప్రకారం.. మహిళలు ముఖాలను గుర్తుంచుకోవడంలో మెరుగ్గా ఉంటారు. అయితే…. ఇది నిద్రలేమి, నిరాశ లేదా వృద్ధాప్యం ఇతర కారణాలు కూడా జ్ఞాపక శక్తిపై ప్రభావం చూపి..ఈ శక్తి తగ్గుతూ వస్తుందట..ఏది ఏమైనా..పురుషుల కంటే.. స్త్రీలకే బుర్ర బాగా పనిచేస్తుందని శాస్త్రవేత్తలు స్పష్టం చేశారు.. మరి మీరు ఏమంటారు అబ్బాయిలూ..!!

Read more RELATED
Recommended to you

Latest news