లాక్‌డౌన్ 4.0లో భాగంగా అనేక ఆంక్షలకు సడలింపు ఇస్తున్నారు. ఇప్పటికే రోడ్డ రవాణా, రైలు సర్వీసులను ప్రారంభించారు. ఇక మే 25వ తేదీ నుంచి దేశీయ విమాన సర్వీసులను నడిపించనున్నారు. ఈ మేరకు కేంద్రం విమానయాన సంస్థలకు అనుమతులు ఇచ్చింది. అయితే విమాన సర్వీసుదారులు, ప్రయాణికులు పలు సూచనలు పాటించాల్సి ఉంటుంది. అవేమిటంటే…
* విమానాల్లో ప్రయాణించే వారు సోషల్ డిస్టన్స్ నిబంధనలను కచ్చితంగా పాటించాలి
* ప్రయాణికులు తమ ఫోన్లలో ఆరోగ్య సేతు యాప్‌ను కచ్చితంగా ఇన్‌స్టాల్ చేసుకోవాలి. లేదా సెల్ఫ్ డిక్లరేషన్ ఫాంను సమర్పించాలి.
* కేవలం డిజిటల్ పేమెంట్ మాత్రమే చేయాలి.
* వెబ్ చెకిన్ చేసి బోర్డింగ్ పాస్ తీసుకోవాలి.
* కేవలం ఒక చెకిన్ బ్యాగ్, ఒక క్యాబిన్ బాగ్‌లకు మాత్రమే అనుమతినిస్తారు.
* వృద్ధులు, గర్భినీలు, ఇతర అనారోగ్య సమస్యలు ఉన్నవారు విమానాల్లో ప్రయాణించరాదు.
* ప్రయాణికులు బ్యాగేజ్ ట్యాగ్ లేదా బ్యాగేజ్ ఐడెంటిఫికేషన్ నంబర్‌ను డౌన్‌లోడ్ చేసి ప్రింట్ తీయాలి. దాన్ని బ్యాగ్‌పై అతికించాలి. అలా చేయలేకపోతే ప్రయాణికులు తమ పీఎన్ఆర్ నంబర్, పేరు వివరాలను తెలపాల్సి ఉంటుంది.
* కేవలం మాస్కులు ధరించిన ప్రయాణికులనే విమానాల్లోకి అనుమతిస్తారు.
* ప్రయాణికులు తమ విమానం ప్రారంభమయ్యేందుకు 2 గంటల ముందుగా ఎయిర్‌పోర్ట్‌కు చేరుకోవాలి.
* ప్రయాణికులు తమ సొంత వాహనాలే లేదా ప్రైవేటు ట్యాక్సీల్లో ఎయిర్‌పోర్టుకు చేరుకోవచ్చు. అందుకు కేంద్ర ప్రభుత్వ నిబంధనలను పాటించాలి.
* ఎయిర్‌పోర్టుకు వచ్చినప్పటి నుంచి విమానం ఎక్కి, దిగి ఇంటికి వెళ్లేవరకు జర్నీలో ప్రయాణికులు కరోనా బారిన పడకుండా అన్ని రకాల జాగ్రత్త చర్యలు పాటించాలి.
* కంటెయిన్మెంట్ జోన్లలో ఉన్నవారిని విమానాల్లో ప్రయాణానికి అనుమతించరు. ఇందుకు గాను ప్రయాణికులు సెల్ఫ్ డిక్లరేషన్‌ను సమర్పించాలి. తమకు కరోనా లేదని, కంటెయిన్మెంట్ జోన్‌లో ఉండడం లేదని, తమకు జ్వరం, దగ్గు, ఇతర శ్వాసకోశ సమస్యలు లేవని, క్వారంటైన్‌లో లేమని, ఏవైనా కరోనా లక్షణాలు కనిపిస్తే వెంటనే అధికారులకు తెలియజేస్తామని, నిబంధనల ప్రకారం తాను విమానంలో ప్రయాణించేందుకు సిద్ధంగా ఉన్నానని, విమాన సర్వీసుదారు అడిగిన వెంటనే పేరు, మొబైల్ నంబర్, ఇతర వివరాలను అందజేస్తానని.. నిబంధనలను ఉల్లంఘిస్తే తనపై ఎలాంటి చర్యలు తీసుకున్నా ఇష్టమేనని ధ్రువీకరిస్తూ.. ప్రయాణికులు సెల్ఫ్ డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది.
* ఇక విమానంలో ప్రయాణికులు పూర్తిగా శుభ్రతను పాటించాలి. వీలైనంత వరకు ఎవరినీ టచ్ చేయరాదు.
* విమానాల్లో భోజనం అందించరు. కానీ వాటర్ బాటిల్స్ ఇస్తారు.
* ప్రయాణంలో ఉన్నప్పుడు ఆహారం తినకూడదు. న్యూస్ పేపర్లు, మ్యాగజైన్లు ఇవ్వరు.
* ప్రయాణికులకు ఎలాంటి అస్వస్థత అనిపించినా వెంటనే విమాన సిబ్బందికి తెలియజేయాలి.
ఇక ఇవే కాకుండా ఎయిర్‌పోర్టు సిబ్బందికి, విమాన సర్వీసు ప్రొవైడర్లకు ప్రత్యేకంగా కేంద్రం పలు సూచనలు జారీ చేసింది. వాటిని వారు కచ్చితంగా పాటించాల్సి ఉంటుందని కేంద్రం తెలిపింది.