సోషల్ మీడియాలో ఈ సొల్లు అసలు నమ్మకండి…!

-

దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ విస్తరిస్తుంటే తప్పుడు ప్రచారం మాత్రం ఎవరికి తోచిన విధంగా వాళ్ళు చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా ఇప్పుడు ప్రచారం మాత్రం తీవ్ర స్థాయిలో జరుగుతుంది. సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న తప్పుడు ప్రచారాలు అన్నీ ఒక్కసారి చూస్తే…

1.అపోలో డాక్టర్ ..రిపోర్టర్ సంభాషణ
2.J D లక్ష్మీనారాయణ గారి వాయిస్
3.ఇటలీ లో ట్రక్కులో కుప్పల శవాలు
4. Jio వారి లైఫ్ టైం ఫ్రీ రీఛార్జి
5.డాక్టర్ దంపతుల మరణం
6.రష్యా 500 సింహాలు రోడ్లపై వదలడం
7.కరోనా వైరస్ కు dr గుప్త మందు
8.రోడ్ల పైన పడి ఉన్న దేహాలు
9.dr నరేష్ పేరుతో వస్తున్న ఎమర్జెన్సీ ప్రకటన
10.COVID-19 పేరుతో మార్కెట్ లోకి మందు
11.ఆవుకు పుట్టిన మనిషి
12.మోడీ గారి 1000 GB ఫ్రీ..
13.బనగానపల్లెలో బ్రహ్మం గారి శిష్యుడు కరోనాకు మందును చెప్పి చనిపోయాడు…
ఇలాంటి సొల్లు సోషల్ మీడియాలో వస్తే మాత్రం అసలు ఎలాంటి పరిస్థితుల్లో కూడా ప్రజలు నమ్మవద్దు అని పోలీసులు కోరుతున్నారు. ఇక హైదరాబాద్ లో కూడా కరోనా కారణంగా రెడ్ జోన్ డేంజర్ జోన్ లను ప్రకటించారని సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. దీనిపై హైదరాబాద్ కలెక్టర్ శ్వేతా మహంతి స్పందించారు. అది తప్పుడు ప్రచారం అని కొట్టి పారేశారు. వీటి కారణంగా వాస్తవాలు అనేవి ప్రజల వద్దకు చేరడం లేదు ఇప్పుడు.

Read more RELATED
Recommended to you

Latest news