ప్రస్తుతం దేశంలో కొవిడ్ ఏ స్థాయిలో విజృంభిస్తుందో చూస్తూనే ఉన్నాం. ఈ కొవిడ్‌ను ఎదుర్కోవాలంటే వ్యాక్సిన్ ఒక్కటే మార్గం. కానీ మన దేశంలో ఇప్పటి వరకువ్యాక్సిన్ కొరత ఏ స్థాయిలో ఉందో చూస్తూనే ఉన్నాం. అయితే ఇక నుంచి ఎలాగైనా వ్యాక్సినేషన్ స్పీడప్ చేయాలని కేంద్రం భావిస్తోంది. ఇందుకోం వచ్చే నెల నుంచి ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది.
జూన్ నెలలో 12 కోట్ల డోసులతో పెద్ద ఎత్తున వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ చేపట్టనున్నట్టు కేంద్రం ప్రకటించింది. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలోని ప్రయారిటీ గ్రూపులకు 6.9 కోట్ల డోసుల వ్యాక్సిన్లు ఇస్తామని చెప్పింది.
ఇందుకోసం ఏర్పాట్లు చేసుకోవాలని సూచించింది. హెల్త్ కేర్ వర్కర్లు, ఫ్రంట్ లైన్ వర్కర్లు, 45 ఏళ్లు పైబడినవారికీ ఈ టీకాలను వేయాలని కోరింది. ఇక ప్రైవేటు ఆస్పత్రులకు కూడా 5.86 కోట్ల డోసుల టీకాలు అందిస్తామని వెల్లడించింది. ఈ వ్యాక్సిన్లు వృధా కాకుండా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలంని చెప్పింది.