ఏ రిలేషన్ షిప్ లో అయినా సరే గొడవలు వస్తూ ఉంటాయి గొడవలు రావడం మళ్ళీ సర్దుకుపోవడం ఇవన్నీ కామన్ గా జరిగేవి. భార్యాభర్తల మధ్య కానీ ప్రియుడు ప్రేయసి మధ్య కానీ రిలేషన్షిప్ బాగుండాలంటే ఖచ్చితంగా వీటిని అనుసరించండి మీ బంధం దృఢంగా ఉండడం మాత్రమే కాకుండా మీరు ఆనందంగా ఉండడానికి కూడా అవుతుంది మరి మీ మధ్య రిలేషన్ షిప్ బాగుండాలంటే ఎటువంటి టిప్స్ ని అనుసరించాలి అనే విషయాన్ని ఇప్పుడు చూద్దాం.
లేవగానే పలకరించండి:
మీరు లేచిన తర్వాత దగ్గర ఉంటే వారిని పలకరించడం లేదంటే మెసేజ్ ద్వారా కానీ కాల్ ద్వార కానీ విష్ చేయడం వంటివి చేయండి మీకోసం ఒకరు ఎదురు చూస్తారు అని మీరు ఆనందంగా విష్ చేస్తే మీరు ఎంత ప్రేమిస్తున్నారు అనేది వారికి తెలుస్తుంది.
సమయాన్ని స్పెండ్ చేయండి:
ప్రతి ఒక్కరికి రోజులో ఎన్నో పనులు ఉంటాయి కానీ మిమ్మల్ని ఇష్టపడే వారి కోసం మీరు కాస్త సమయాన్ని స్పెండ్ చేస్తే మీ మధ్య రిలేషన్షిప్ దృఢంగా ఉంటుంది.
ఇతరులు చెప్పేది వినండి:
నిజంగా మీరు ఇష్టపడుతున్నట్లయితే వాళ్ళు చెప్పేది కచ్చితంగా వినండి వాళ్ళు చెప్పేది మీరు విన్నట్లయితే వాళ్లు ఎంతో ఆనందిస్తారు. అంతేకానీ వాళ్లు మాట్లాడేటప్పుడు మీరు ఫోన్ చూసుకోవడం లేదంటే మీ పనులు చేసుకోవడం వంటివి చేస్తే వారికి కోపం వస్తుంది సరి కదా మీ రిలేషన్షిప్ మీద వారికి అనుమానం కలుగుతుంది.
అబద్ధాలు వద్దు:
నిజాయితీగా ఉండడం చాలా ముఖ్యం మీరు ఇష్టపడే వాళ్ళతో నిజాయితీగా ఉంటే మీ బంధం బాగుంటుంది లేదంటే లేనిపోని సమస్యలు వస్తాయి.
సరదాగా బయటకు వెళ్ళండి:
మీరు ఇష్టపడే వాళ్ళతో మీరు కాస్త సమయాన్ని ఎక్కడికైనా వెళ్లడానికి కేటాయిస్తే వారు మీరు కూడా ఆనందంగా ఉంటారు.
ముఖ్యమైన తేదీలను గుర్తుపెట్టుకోండి:
చాలామందికి ఈ మధ్య గొడవలు దీనివల్ల వస్తూ ఉంటాయి. ముఖ్యమైన తేదీలు అంటే పుట్టినరోజు పెళ్లి రోజు వంటి విషయాలను గుర్తు పెట్టుకుంటే మీ మధ్య బంధం దృఢంగా ఉంటుంది లేదంటే లేనిపోని సమస్యలు వచ్చి మీ బంధం ముక్కలైపోవచ్చు.