మద్యపానంలో మంచింగ్ గా తీసుకోకూడని ఆహారాలు..

-

మందు తాగేటపుడు మంచింగ్ కోసం ఏది పడితే అది తినేయడం చాలామందికి అలవాటుగా ఉంటుంది. చాలా కొద్దిమంది మాత్రమే కొన్ని ప్రత్యేకమైన మంచింగ్ తీసుకుంటుంటారు. ఐతే మీరు తీసుకునే మంచింగ్ కారణంగానే హ్యాంగోవర్ వస్తుందన్న విషయం మీకు తెలుసా? మద్యపానం Alcoholలో మంచింగ్ గా కొన్ని ఆహారాలను అస్సలు ముట్టుకోవద్దు. మరీ ముఖ్యంగా వైన్ తాగేవాళ్ళు కింద చెప్పే ఆహారాలను తీసుకోకపోవడమే మంచిది.

చాక్లెట్

వైన్ సేవించే కొంతమంది చాక్లెట్ ని మంచింగ్ గా తీసుకుంటారు. కానీ అది సరైన కాంబినేషన్ కాదు. చాక్లెట్ కారణంగా కడుపులో గ్యాస్ పెరుగుతుంది. ఇంకా అసిడిటీ పెరిగే అవకాశాలు ఎక్కువ. కాబట్టి చాక్లెట్ ఎంత బాగున్నప్పటికీ దూరం పెట్టేయండి.

బీన్స్

బీన్స్ లో ఐరన్ అధికంగా ఉంటుంది. అందువల్ల వైన్ తాగేటపుడు బీన్స్, కాయధాన్యాలు మొదలగు వాటిని ముట్టుకోవద్దు. దీనివల్ల మీ శరీరానికి ఒకరకమైన కన్ఫ్యూజన్ ఏర్పడుతుంది. అందువల్ల శరీరం మద్యాన్ని సరిగ్గా గ్రహించదు.

వేయించిన ఆహారాలు

వేయించిన ఆహారాలతో పాటు ఉప్పు ఎక్కువగా ఉండే ఆహారాలను వైన్ తో పాటు తీసుకోవద్దు. వీటివల్ల చాలా తొందరగా శరీరంలోని నీరు తగ్గిపోతుంది. దానివల్ల మీలో శక్తి పూర్తిగా తగ్గిపోతుంది. దీనికి బదులు గ్రిల్డ్ చికెన్ బాగుంటుంది.

బ్రెడ్

ఇది అత్యంత చెత్త కలయిక అని చెప్పవచ్చు. మద్యపానం సేవించేటపుడు బ్రెడ్ అస్సలు తినకూడదు. శరీరంలోని నీటిశాతాన్ని తగ్గించి డీహైడ్రేట్ చేస్తుంది కాబట్టి దానికి దూరంగా ఉండడమే మంచిది.

కెఫిన్

మద్యం తాగిన తర్వాత పొరపాటున కుడా కాఫీ తాగవద్దు. ఇది మంచి కలయిక కాదు. దీనివల్ల తెల్లారాక వాంతులు అయ్యే అవకాశం ఎక్కువ. హ్యాంగోవర్ కి ఇది ప్రధాన కారణం కావచ్చు.

 

Read more RELATED
Recommended to you

Latest news