పవన్‌ ఫ్యాన్స్‌ కు మరో గుడ్‌న్యూస్‌…ఇవాళ సాయంత్రమే మరో అప్డేట్‌

-

వకీల్‌ సాబ్‌ సినిమాతో మంచి విజయం సాధించిన పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌…. వరుస సినిమాలను లైన్‌ లో పెట్టారు. ఈ నేపథ్యంలోనే యంగ్‌ హీరో రానాతో కలిసి ఓ మల్టీస్టారర్‌ సినిమా చేస్తున్నాడు. మలయాళం లో సూపర్‌ హిట్‌ అయిన… అయ్యప్పనుమ్‌ కోషియమ్‌ సినిమాను పవన్‌ తెలుగులో రీమేక్‌ చేస్తున్నారు.

సాగర్‌ చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్‌ కరోనా కారణంగా వాయిదా పడిన సంగతి తెలిసిందే. అయితే.. తాజాగా నిన్న ఈ సినిమా షూటింగ్‌ ప్రారంభం అయింది. ఈ సినిమాలో ”బీమ్ల నాయక్‌” అనే పోలీసు పాత్రను పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ పోషిస్తున్నాడు. ఇక నిన్న ఈ మూవీ షూటింగ్‌ ప్రారంభం కాగా… ఇవాళ సాయంత్రం పూట… 4.05 కు ఈ షూటింగ్‌ కు సంబంధించిన ఓ మేకింగ్‌ వీడియోను రిలీజ్‌ చేయనున్నట్లు ఈ సినిమా బృందం ప్రకటించింది. ఈ మేకింగ్‌ వీడియోలో పవర్‌ స్టార్‌ కనిపించనుండట. ఇక ఈ ప్రకటనతో పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ ఫ్యాన్స్‌ కొత్త ఉత్సాహం నెలకొంది.

Read more RELATED
Recommended to you

Latest news