నల్గొండ జిల్లాలో షర్మిల దీక్ష.. సాయంత్రం 6 తర్వాత ప్రసంగం

-

నల్గొండ: చుండూరు మండలం పుల్లెంలలో షర్మిల నిరుద్యోగ దీక్ష కొనసాగుతోంది. ఈ ఉదయం పుల్లెంలకు చేరుకున్న షర్మిల.. ముందుగా ఆత్మహత్య చేసుకున్న నిరుద్యోగి శ్రీకాంత్ కుటుంబాన్ని పరామర్శించారు. స్థానికంగా ఏర్పాటు చేసిన నిరాహార దీక్షలో ఆమె పాల్గొన్నారు. వైఎస్ చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తెలంగాణలో ఉద్యోగాలు భర్తీ చేసే వరకూ తమ పోరాటం సాగుతుందని షర్మిల తెలిపారు.

కాగా వైఎస్సార్ తెలంగాణ పార్టీని స్థాపించిన షర్మిల.. రాష్ట్రంలో పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టారు. నిరుద్యోగ సమస్యపై రాష్ట్రవ్యాప్తంగా దీక్షల చేపడుతున్నారు. పలు చోట్ల ఆమె ఇప్పటికే దీక్షలు నిర్వహించారు. ప్రతి మంగళవారం ఆమె ఈ దీక్షలు చేపడుతున్నారు. తెలంగాణలో వైఎస్ ఆశయాల కోసమే తమ పార్టీ పనిచేస్తుందని షర్మిల చెప్పారు. వైఎస్ హయాంలో చేపట్టిన పథకాలే ప్రజలకు శ్రీరామరక్ష అయ్యాయని ఆమె గుర్తు చూస్తూ దీక్షలు నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలో నిరుద్యోగం ఇంతగా పెరగడానికి సీఎం కేసీఆరే కారణమని షర్మిల ఆరోపిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news