డోరా లేకా బీచా.. కన్ఫ్యూజింగ్ గా ఉందే..?

-

సోషల్ మీడియా.. క్షణాల్లో ఎవరినైనా స్టార్ ను చేసేయగలదు. నెటిజన్లుకు పదునైన సవాళ్లు విసిరేయగలదు. నిక్కచ్చిగా చెప్పాలంటే తమ్మిని బమ్మి… బమ్మిని తమ్మి చేసేయగలదు. దానికి అంత సత్తా ఉంది. ఇప్పుడు ఇదంతా ఎందుకంటే…

ఓ ఫోటో.. జస్ట్ ఫోటో.. గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నిజానికి ఓ పజిల్ లా నెటిజన్లందరినీ ఆలోచింపజేసింది. ఇంతకీ అదేం ఫోటో అంటారా? మీరు పైన చూస్తున్న ఫోటో అదే. చూశారుగా.. ఏంటంటారు ఆ ఫోటో. అది డోర్ లాగా కనిపిస్తున్నది.. కదా.. ఎహె.. కాదు కాదు.. బీచ్ లా ఉందే? ఇదేందో అర్థం కావట్లేదు అది నెత్తి గోక్కుంటున్నారా? మీరే కాదు నెటిజన్లు కూడా ఇలాగే తమ మెదడుకు పదును పెట్టి మరీ.. అది దేనికి సంబంధించిందో కనుక్కునే పనిలో పడ్డారు.

ఇంతకీ మీకేమైనా తెలిసిందా? అదేంటంటారు.. ఈ ఫోటోను ట్విట్టర్ యూజర్ బెకీ సోషల్ మీడియాలో షేర్ చేశాడు. అది డోరా లేక బీచా? అంటూ క్యాప్సన్ పెట్టాడు. దీంతో ఇక నెటిజన్లు తమకు తోచిన కామెంట్లు పెట్టి ఆ ఫోటోను వైరల్ చేస్తున్నారు.

సోషల్ మీడియాలో ఈ తరహా ఫోటోలు వైరల్ కావడం సహజమే. ఎప్పుడూ ఏదో ఒక ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంటూనే ఉంటుంది. ఇప్పుడు ఈ ఫోటో. ఇక.. నెటిజన్లకు కాస్త బుర్ర పదును పెట్టేలా చేసిన తర్వాత ఓ మూడు రోజులకు ఇంతకీ అది డోరా లేక బీచా అనే మిలియన్ డాలర్ల ప్రశ్నకు తెరతీశాడు బెకీ. మళ్లీ ఓ ఫోటో షేర్ చేసి అసలు నిజం చెప్పేశాడు. చూడండి.. ఆ ఫోటో ఏందో?

చూశారుగా.. అది డోర్ కాదు.. గీర్ కాదు.. బీచ్ ఫోటో. కాకపోతే దాన్ని కొంచెం రివర్స్ చేసి అప్ లోడ్ చేసేసరికి అది డోర్ లా కనిపించిందన్నమాట. అంతే అయిపోయింది వార్త.

Read more RELATED
Recommended to you

Latest news