వాటెన్ ఐడియా సర్జీ…పూలను డోర్ డెలివరీ చేసే వ్యాపారం.. లాభం కోట్లల్లో..!

-

అవసరం ఏదైనా నేర్పిస్తుందని అంటుంటారు.. ఇది వందశాతం కరెక్టు కదా..! వచ్చే ప్రతి సమస్యా.. మనిషిని ఇంకా ధృడంగా చేస్తుంది. అయినవాళ్లు ఎవరో కానివాళ్లు ఎవరూ తెలిసేలా చేస్తుంది. సమస్యను పరిష్కరించటం కోసం జరిగే మేదోమధనంలోంచి.. కొత్త ఆలోచనలు పుట్టుకొస్తాయి. అవే కొన్నిసార్లు లైఫ్ టర్నింగ్ పాయింట్స్ కూడా అ‌వుతాయి… సరిగ్గా ఇలానే జరిగింది ఆ అక్కాచెల్లెల విషయంలో… ఒకప్పుడు అంటే.. ఇళ్లలో పూలు పెంచుకునే వాళ్లు.. దేవుడికి అ‌వే వాడేవారు.. కానీ ఇప్పుడు ఇరుకుఇళ్లు..పూల మొక్కలు పెంచే ప్లేసు లేదు. మార్కెట్ లోనే పూలు కొంటున్నారు.. ఇదే పాయింట్ పట్టుకుని..పూలతో వ్యాపారం చేసి..సక్సస్ ఫుల్ గా రన్ చేస్తున్నారు. పూలవ్యాపారానికి ఇంత సీన్ ఏంట్రా అనుకుంటున్నారా..? మీరే చూడండి..!

బెంగళూరుకు చెందిన యశోద కరుటూరి, రియా అక్కాచెల్లెలు. వీళ్లు.. వ్యాపారంగా పువ్వులను డోర్ డెలివరీ చేయాలనుకున్నారు. పాలు, పేపర్ ఎలా అయితే.. ఇంటి వద్దకే వస్తాయో.. అలా పూలను కూడా రోజు ఉదయం గుమ్మముందుకే తేవడమే వీరి కాన్సప్ట్. తాజా పువ్వులు గులాబీలు, చామంతి, తామరపువ్వులు వంటి అనేక రకాల పువ్వులను ఇంటికే డెలివరీ చేసే స్టార్టప్ ను అక్కచెల్లెలు ప్రారంభించారు. దీనికి హూవూ (కన్నడలో ‘పువ్వులు’) అనే పేరు పెట్టారు. రూ. 10 లక్షల పెట్టుబడితో బిజినెస్ ను ప్రారంభించారు. ఇక హూవూ ఇప్పుడు ఏటా రూ.8 కోట్ల టర్నోవరు సాధిస్తోంది.

మార్కెట్ లో ఫ్లవర్ బొకేలకు డిమాండ్ బానే ఉంది.. బాగా డవలప్ అయింది కూడా.. కానీ సాంప్రదాయ పూజకు ఉపయోగించే పూల మార్కెట్ అంతగా అభివృద్ధి చెందలేదని వీళ్లు గుర్తించారు. అంతేకాదు నిజానికి వినియోదారులకు ఎక్కువగా ఫ్లవర్ బోకేల్లో వాడే పూల కంటే.. పూజకు ఉపయోగించే పువ్వులే కావాలనే విషయం ఈ అక్కాచెల్లెల్లు గమనించారు. దీంతో 2019లో ఈ అక్కాచెల్లెల్లు ఇద్దరూ పూల మార్కెట్‌కు సబ్‌స్క్రిప్షన్ సిస్టమ్‌ ప్రవేశ పెట్టి.. తమ వ్యాపారానికి ఆధునిక మలుపుని తీసుకొచ్చారు. దీంతో పువ్వుల డోర్ డెలివరీ వ్యాపారం మరింత డవలప్ అయింది.
ఈ ప్యాకింగ్ వలన పువ్వులు దాదాపు 15 రోజుల వరకూ ప్రెష్ గా ఉంటాయి. తాజాగా పువ్వుల కోసం నేరుగా రైతులతో టైఅప్ అయ్యారు. తమ హూవూ.. ద్వారా సెలబ్రెటీల నుంచి సామాన్యుల వరకూ ఆర్డర్లు అందుకుంటున్నారు. బిగ్ బాస్కెట్, గ్రోఫర్స్, సూపర్ డైలీ, జొమాటో, మిల్క్‌బాస్కెట్, ఎఫ్‌టిహెచ్ డైలీ , జెప్టో వంటి విభిన్న ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా కస్టమర్స్ నుంచి ఆర్డర్లు అందుకుంటున్నట్లు యశోద తెలిపారు.
బెంగళూరు, హైదరాబాద్, చెన్నై, మైసూర్, పూణే, ముంబై, గురుగ్రామ్, నోయిడా సహా అనేక ప్రాంతాల నుంచి వీరికి ఆర్డర్లు అందుకుంటున్నారు. ఇలా దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చే ఆర్డర్లు నెలకు సుమారు 1,50,000 లు ఉంటాయట. ఇదొక్కటే కాదండోయ్.. పువ్వులతో అగర్బత్తీల తయారీని కూడా మొదలు పెట్టారు. ఇది కూడా ప్రస్తుతం లాభాల బాటలోనే నడుస్తున్నట్లు చెప్పారు. మొత్తానికి అక్కాచెల్లెల్లు అలా కస్టమర్స్ పల్స్ పట్టుకుని సక్సస్ ఫుల్గా లాభాల బాటలో నడుస్తున్నారు.
-Triveni Buskarowthu

Read more RELATED
Recommended to you

Latest news