అక్వేరియంలో చేపలను ఉంచితే సంపద రెట్టింపు అవుతుందా?

-

చాలా మందికి పెంపుడు జంతువుల పాటు..చేపలను కూడా ఇంట్లో పెంచుకోవడం అంటే చాలా ఇష్టం ఉంటుంది..అయితే కొంత మంది చేపలను ఇంట్లో పెంచుకుంటే ఆర్థిక నష్టాలు కలుగుతాయని అనుకుంటారు. అయితే వాస్తు శాస్త్రంలో మాత్రం చేపలను పెంచడం గురించి నెగిటివ్ గా అయితే లేదు.అందుకే కొందరు చేపలను పెంచడం హాబిగా మార్చుకున్నారు.అసలు ఇంట్లో చేపలను పెంచడం పై శాస్త్రాలు ఏం చెబుతున్నాయో ఇప్పుడు ఒకసారి చుద్దాము..

లైవ్ ఫిష్ లేదా మెటల్ ఫిష్ ఎందుకు ఉంచుతారు. చాలామంది తమ ఇంట్లో లేదా కార్యాలయంలోని అక్వేరియంలో చేపలను ఉంచుతారు. ఇది వారి ఇంటి అందాన్ని పెంచుతుంది. అలాగే విష్ణువు మత్స్య అవతారం కారణంగా, ఇంట్లో చేపలను ఉంచడం వల్ల విష్ణువు అనుగ్రహం లభిస్తుందని నమ్ముతారు.ఇంట్లో ఆనందం ఉంటుంది. చేపలు నివసించే ఇంట్లో వ్యాధులు కూడా రావని, దీర్ఘ కాలిక రోగాలు కూడా నయం అవుతాయని అంటున్నారు.

నెగెటివ్ ఎనర్జీ పోయి ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ నింపబడుతుంది. చేపల చురుకుదనాన్ని చూసి మనసు ఆనందంగా ఉంటుంది, దీని వల్ల మానసిక ఒత్తిడి నుంచి ఉపశమనం పొందుతారు. అప్పుల బారిన పడకుండా చేపలు మనల్ని కాపాడతాయని కూడా అంటారు. చేపల అక్వేరియం ఇంటికి లేదా కార్యాలయానికి తూర్పు, ఉత్తరం లేదా ఈశాన్య దిశలో ఉంచినట్లయితే, సంపద పెరుగుతుంది. చేపలు అదృష్టానికి సంకేతం..అందుకే చేప బొమ్మలను అయిన పెడతారు..కొందరు తాబేలును కూడా ఉంచుతారు.. మీ ఇంట్లో లక్ష్మీ దేవి తాండవం చేయాలంటే చేపలను కూడా ఉంచుకోవడం మంచిది.

Read more RELATED
Recommended to you

Latest news