మీ కాలేయంపై కాస్త కేర్‌ తీసుకోండి!

-

కాలేయానికి సంబంధించిన రోగాలు చాలా ప్రమాదకరమైనవి. ప్రతి ఏడాది సుమారు 10 లక్షల మంది కాలేయ సంబంధిత వ్యాధికి గురవుతున్నారు. ఈ రోగ లక్షణం ప్రమాదస్థాయికి చేరిన తర్వాతనే బయటపడటం. లివర్‌ సిర్రోసిస్‌ స్టేజ్‌కు వచ్చిన తర్వాత చికిత్స కష్టతరం అవుతుంది. ఒక్కోసారి మరణాలకు కూడా సంభవిస్తాయని ప్రముఖ హెచ్‌బీపీ అండ్‌ ట్రాన్స్‌ప్లాంట్‌ సర్జన్‌ రాజీవ్‌ లోజన్‌ తెలిపారు.


ప్రపంచ ఆరోగ్య సంస్థ వివరాల ప్రకారం ప్రతి పదిమందిలో ఒక భారతీయులు లివర్‌ కేన్సర్‌తో∙చనిపోతున్నారు. ప్రస్తుత ప్రమాదకర పరిస్థితులు కూడా లివర్‌ సంబంధిత వ్యాధిగ్రస్తులకు చాలా ప్రమాదకరం. వారికి కరోనా సోకితే డేంజర్‌ స్టేజీలోకి వైళ్లిపోయే ప్రమాదం చోటుచేసుకుంటుంది. మొదట్లో ‘సార్స్‌’ వ్యాధి వచ్చినపుడు కూడా లివర్‌ సంబంధిత వ్యాధిగ్రస్తులు సగానికిపైగా దీని బారిన పడ్డారు. అయితే, కరోనా వల్ల కూడా లివర్‌ పనితీరుపై ఎఫెక్ట్‌ పడుతుందన్నారు డాక్టర్‌ లోచన్‌. ఇంకా చాలా పరిశోధనలు లివర్‌పై కరోనా ఎఫెక్ట్‌కు కారణాలు ఎంటో తెలుసుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. సెకండ్‌ వేవ్‌ కరోనా బారిన పడిన చాలా మంది జీఐ ప్రభావంతో వ్యాధికి గురైనారని దాని వల్ల లివర్‌తోపాటు, కిడ్నీ బాడీలోపలి ఆర్గాన్స్‌పై తీవ్ర రూపం దాల్చుతుంది. అందుకే ఈ వ్యాధిగ్రస్తులు కోవిడ్‌ వైరస్‌ సోకితే తమ ఆరోగ్యంపై అధికశాతం కేర్‌ తీసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ మీకు లివర్‌ సంబంధిత వ్యాధులు లేకున్నా, కరోనా సోకితే వైరస్‌ ప్రభావం మీ లివర్‌పై కూడా పడుతుంది. లివర్‌ ఏపనితీరుపై వైరస్‌ ప్రభావం పడిందో కూడా తెలుసుకోలేని పరిస్థితి ఏర్పడుతుంది. అయితే డాక్టర్‌ లోచన్‌ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఈ విధంగా ఉన్నాయి.

మద్యపానానికి దూరంగా ఉండాలి..

కొంతమంది అలవాట్ల వల్ల అనారోగ్య పరిస్థితులకు దారితీస్తున్నాయి. తరచూ మద్యం సేవించడం వల్ల కాలేయం సంబంధిత వ్యాధులకు దారితీస్తుంది. అలాగే పొగతాగటం కూడా మద్యం సేవించడంతో సమానం ఇది కూడా లివర్‌ వ్యాధులకు దారితీస్తుంది.

ఆరోగ్యకరమైన ఆహారం..

పండ్లు, కూరగాయలు లివర్‌ను శక్తివంతమైన పనితీరుకు తోడ్పడుతుంది. యాంటిఆక్సిడెంట్స్‌ బెర్రిస్, గ్రీన్‌టీ, ఆలివ్‌ ఆయిల్, అవకాడో, అరటిపండ్లు, ఆకుకూరలు, వెల్లుల్లి లివర్‌ మెరుగైన పనితీరుకు దోహదపడతాయి. సోడియం ఆధారిత ఆహారం ఫ్రైడ్‌ ఐటమ్స్, ఫాస్ట్‌ఫుడ్‌ తినకూడదు.

ఎక్సర్‌సైజ్‌ ఎన్నటికీ మరవద్దు..

ఎక్సర్‌సైజ్‌ చేయడానికి అధిక సమయాన్ని కేటాయించాలి. కొన్ని వైద్య ఆధారిత నివేదికల ప్రకారం ఎక్సర్‌సైజ్‌ వల్ల లివర్‌ ఆరోగ్య వంతంగా పనిచేస్తుంది. వారానికి 4 రోజులు తప్పకుండా లివర్‌ ఎక్సర్‌సైజ్‌ చేయాలి. ఏవైన ఇతర అనారోగ్య సమస్యలు ఉంటే సంబంధిత నిపుణులను సంప్రదించండి. ఒబెసిటీ కూడా ఈ వ్యాధికి దారితీస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news