పుట్టినరోజున ఆ పని చేస్తే.. బంధుమిత్రులందరికీ అనారోగ్యమే!

-

 

ఈ రోజుల్లో చిన్నాపెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరూ తమ స్థాయినిబట్టి పుట్టినరోజును వేడుకలా జరుపుకోవడం సాధారణం అయిపోయింది. పొద్దున లేచింది మొదలు రోజంతా బంధువులు, స్నేహితులు ప్రత్యక్షంగానో లేదా పరోక్షంగానో అంటే ఫోన్లలోనో, సోషల్‌ మీడియాలోనో శుభాకాంక్షలతో ముంచెత్తుతారు. వాళ్లందరికి మనం కృతజ్ఞతలు తెలుపుతాం. ఇగ సాయంత్రానికి పార్టీ టైమ్‌ మొదలవుతుంది. ఈ పార్టీని ఎవరెవరు ఏ స్థాయిలో, ఏ రకంగా జరుపుకున్నా.. అన్ని పార్టీల్లోనూ కేక్‌ కట్‌ చేయడం అనేది మాత్రం కామన్‌గా ఉంటుంది.

పుట్టినరోజునాడు బంధువులు, స్నేహితుల మధ్య కేక్‌ కట్‌చేసి సంబురం జరుపుకోవడం వరకు ఎలాంటి సమస్య లేదు. అయితే కేకుల మీద కొవ్వుత్తులను వెలిగించి వాటిని నోటితో ఊదుతాం చూడూ.. అక్కడ వస్తుంది సమస్యంతా. ఇలా కేకుల మీద కొవ్వొత్తులు వెలిగించి నోటితో ఊదడం అంత శ్రేయస్కరం కాదట. నోటితో ఊదడంవల్ల ఆ నోటిలోని లాలాజలం ఎంతోకొంత తుంపరగా కేక్‌పైన పడుతుందట. సాధారణంగా లాలాజలంలో బ్యాక్టీరియా ఉంటుంది. అది అంత ప్రమాదకరం కానప్పటికీ.. ఆ లాలాజల తుంపర్లు కేక్‌పై ఉన్న చల్లని క్రీమ్‌ లేయర్‌పై పడగానే అందులోని బ్యాక్టీరియా 15 వేల శాతానికిపైగా పెరిగి కేక్‌ మొత్తం విస్తరిస్తుందట. ఇది మాత్రం ప్రమాదకరమే.

అయితే కేక్‌పైన క్యాండిల్ ఊదిన వ్యక్తి ఆరోగ్యంతుడైతే ఈ బ్యాక్టీరియా అంతగా హాని చేయదట. మనలోని వ్యాధినిరోధక వ్యవస్థకు దాన్ని ఎదిరించే శక్తి ఉంటుందట. కానీ ఆ వ్యక్తికి గనుక జలుబు, దగ్గు, ఫ్లూ జ్వరం లాంటి ఇన్ఫెక్షన్లు ఉంటే మాత్రం అవి కచ్చితంగా కేక్‌ తిన్న అందరికీ అంటుకుంటాయట. అందుకే మనం కేకులు కట్‌చేసినా.. వాటిపైన క్యాండిళ్లు పెట్టి ఊదే సంప్రదాయాన్ని వదిలిపెడితే సరిపోతుంది. లేదంటే మాత్రం ‘కూలీ ఇచ్చి నెత్తిమీద కొట్టించుకున్నట్టే’ అవుతుంది.

Happy little girl blowing out candles on her birthday cake

ఇదేమీ మిమ్మల్ని భయపెట్టడానికి చెప్తున్న విషయం కాదు.. చాలా రోజుల క్రితమే దక్షిణ కరోలినాలోని క్లెమ్సన్‌ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు శాస్త్రీయంగా నిరూపించారు. ఎంతోమందిపై పరిశోధనలు జరిపి కేక్‌పై క్యాండిల్‌ను ఊదినప్పటితో పోల్చితే 15 నిమిషాల తర్వాత బ్యాక్టీరియా దాదాపు 15 వేల శాతం పెరుగుతున్నట్లు గుర్తించారు. అందుకే పుట్టినరోజు వేడుకల్లో కేక్‌పై క్యాండిల్స్‌ పెట్టి ఊదే పద్ధతికి చెక్ పెట్టడమే ఉత్తమం.

Read more RELATED
Recommended to you

Latest news