వాటే స్కీమ్..124 నెలల్లో డబ్బులు రెట్టింపు..!

-

చాలా మంది తమ డబ్బులను పెట్టుబడి కింద పెట్టి ఎక్కువ డబ్బులను తరవాత పొందాలనుకుంటున్నారు. మీరు కూడా మీ డబ్బులను అలా సేవ్ చేసి ఒకేసారి ఎక్కువగా డబ్బులని పొందాలనుకుంటున్నారా..? అయితే ఇది మీకోసమే. మెరుగైన, గ్యారెంటీ రిటర్న్స్ ని కల్పించాలని స్పెషల్ సేవింగ్స్ స్కీమ్ తీసుకు వచ్చింది.

పోస్టాఫీసుల ద్వారా ఈ స్కీమ్ ని అందిస్తున్నారు. అదే కిసాన్ వికాస్ పత్ర. దీని యొక్క వడ్డీ రేటు సంవత్సరానికి 6.9 శాతంగా ఉంది. బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్ రేట్ల కంటే ఇది ఎక్కువగా ఉండడం విశేషం. కిసాన్ వికాస్ పత్ర స్కీమ్ తో డబ్బులను మనం రెట్టింపు చేసుకోవచ్చు.

ప్రస్తుత వడ్డీ రేటు ప్రకారం చుస్తే.. 10 సంవత్సరాల 4 నెలల్లో అంటే 124 నెలలులో డబ్బు రెట్టింపు అవుతుంది. మీరు కనుక ఈ కిసాన్ వికాస్ పత్ర స్కీమ్ లో లక్ష రూపాయలను డిపాజిట్ చేసారంటే 124 నెలలులో అవి రెండు లక్షలు అవుతాయి.

ఈరోజు పథకంలో డిపాజిట్ చేస్తే అవి 124 నెలల తర్వాత మెచ్యూర్ అవుతుంది. ప్రత్యేక పరిస్థితుల్లో ప్రీమెచూర్ విత్‌డ్రా కూడా చేసుకోవచ్చు. ఎలాంటి రిస్క్ కూడా ఉండదు. కనిష్టంగా రూ. 1000 ఆ తర్వాత రూ.100 గుణకాలలో డిపాజిట్ చేసుకోవడానికి అవుతుంది. ఒకవేళ ట్రాన్స్‌ఫర్ ఖాతాదారుడు మరణిస్తే నామినీ/చట్టపరమైన వారసులకు ఈ అకౌంట్ ని ట్రాన్స్ఫర్ చేస్తారు కనుక ఏ సమస్య రాదు. ఖాతాదారుడు మరణించినప్పుడు జాయింట్ అకౌంట్ హోల్డర్‌కు ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది.

 

Read more RELATED
Recommended to you

Latest news