Pawan Kalyan: భవదీయుడు భగత్ సింగ్ పై క్రేజీ అప్డేట్ ఇచ్చిన హరీష్ శంకర్..

-

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ .. వకీల్ సాబ్ చిత్రంతో రీఎంట్రీ ఇచ్చిన ఆయ‌న వ‌రుస సినిమాల‌తో బిజీగా అయ్యాడు.ప్ర‌స్తుతం సాగ‌ర్ కె. చంద్ర ద‌ర్శ‌క‌త్వంలో భీమ్లా నాయ‌క్ అనే చిత్రంలో న‌టిస్తున్నారు. ఇంకో వైపు క్రిష్ దర్శకత్వంలో హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు అనే సినిమా చేస్తున్నాడు. త‌గ్గేదేలే అన్న‌ట్లు తాజా ప‌వ‌న్ మ‌రో క్రేజీ ప్రాజెక్ట్ కు సిద్ద‌మ‌య్యారు. ‘గబ్బర్ సింగ్’ లాంటి బ్లాక్ బస్టర్ అందించిన హరీష్ శంకర్ ద‌ర్శ‌క‌త్వంలో ‘భవదీయుడు భగత్ సింగ్’ అనే సినిమా చేయ‌నున్నారు.

ఈ క్రేజీ కాంబినేష‌న్‌లో సినిమా అంటే.. ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు మొద‌ల‌వుతుందా ? ఎప్పుడెప్పుడూ ప్రేక్ష‌కుల ముందుకు రానున్నది అని ప‌వ‌న్ అభిమానులు ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ నేప‌థ్యంలో ఈ చిత్రం నుంచి ఓ ఇంట్రెంస్టింగ్ అప్డేట్ ఇచ్చాడు దర్శకుడు హరీష్‌ శంకర్‌. పవర్‌ స్టార్‌ ఫ్యాన్స్‌ అభిమానుల ట్వీట్లకు రిప్లై ఇచ్చే నేపథ్యంలోనే.. ఓ అభిమానికి తన స్టైల్‌ లో ఆన్సర్‌ ఇచ్చాడు హరీష్‌.

ఆ స్టైలు, స్వాగ్‌, ఏమైపోయాయ్‌ కళ్యాణ్‌ అన్నా. హరీష్‌ శంకర్‌ అన్నా మళ్లీ నీ వల్లే అవుతుంది ఇవన్నీ… నీ సినిమాతోనే లాస్ట్‌ అనిపిస్తుంది అంటూ ఓ ఫ్యాన్‌ ట్వీట చేశాడు. దీనిపై స్పందించాడు హరీష్‌ శంకర్‌. అన్నీ ఉంటాయ్‌.. ఏదీ మిస్‌ అవ్వదు… మీ ఎదురు చూపులకు తగ్గ ప్రతి ఫలం వస్తుంది నన్ను నమ్మండి అంటూ రిప్లై ఇచ్చాడు. దీంతో పవన్‌ ఫ్యాన్స్‌ ఖుషీ అవుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news