హుజురాబాద్ ఉప ఎన్నికలు రసవత్తంగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. మాజీ మంత్రి ఈటల రాజేందర్… రాజీనామా నేపథ్యంలో హుజురాబాద్ నియోజకవర్గంలో ఉప ఎన్నికల అనివార్యం అయింది. దీంతో అధికార టీఆర్‌ఎస్ పార్టీలతో సహా… అన్ని పార్టీలు ఇప్పటికే హుజురాబాద్ నియోజకవర్గంలో పాగా వేశాయి. ఓటర్లను తమవైపు కు తిప్పుకునేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నాయి పార్టీలు.
ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ నుంచి పాడి కౌశిక్ రెడ్డిని అధికార టీఆర్‌ఎస్ పార్టీ లాగేసుకుంది. ఈ నేపథ్యంలో ఇటీవలే.. టీఆర్‌ఎస్‌లో పాడి కౌశిక్ రెడ్డి చేరారు. అయితే.. పాడి కౌశిక్ రెడ్డి పార్టీ మార్పుపై ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ సంచలన ట్వీట్ చేశారు.
టీఆర్‌ఎస్ పార్టీలో చేరే తరుణంలో పాడి కౌశిక్ రెడ్డి.. రెడ్డి నాయకులకు గౌరవంగా.. దళితులను అగౌరవంగా పిలిచారని ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ మండిపడ్డారు. ”కౌశిక్ బ్రదర్, మీరు ఆధిపత్యకులాల నాయకులను ‘గారు’ అని గౌరవించి, పీడిత వర్గాలకు చెందిన వారిని మాత్రం ఏక వచనంతో పిలిచారు. ఇది అభ్యంతరకరం. ఇలాంటి దురహంకార భావజాలం వల్లనే జనాలు బహుజనరాజ్యం రావాలంటున్నారు” అంటూ ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు.
కౌశిక్ బ్రదర్, మీరు ఆధిపత్యకులాల నాయకులను ‘గారు’ అని గౌరవించి, పీడిత వర్గాలకు చెందిన వారిని మాత్రం ఏక వచనంతో పిలిచారు. ఇది అభ్యంతరకరం. ఇలాంటి దురహంకార భావజాలం వల్లనే జనాలు బహుజనరాజ్యం రావాలంటున్నరు. I am not against any particular caste, but we must stop this reckless framing. pic.twitter.com/jL3tOb6YIw
— Dr. RS Praveen Kumar (@RSPraveenSwaero) July 27, 2021