న్యూజిలాండ్ జట్టుకి మంచి జ్యోతిష్యుడు ఉంటే బాగుండేది గురూ…!

-

నలుపు మంచిది కాదని చెప్పినా విని సావలేదు… చూడు 5 మ్యాచులు ఆడితే 5 ఓడిపోయింది. అసలు న్యూజిలాండ్ జట్టు దరిద్రం ప్రధానంగా నలుపే మాస్టారూ. లేకపోతే రెండు సూపర్ ఓవర్లు రావడం ఏంటీ…? ఆ రెండు సూపర్ ఓవర్లలో ఓడిపోవడం ఏంటీ…? ఇదేం చండాలం. ఏమో గురు వాళ్ళని చూస్తే నవ్వాలో ఏడవాలో అర్ధం కావట్లేదు. 38 పరుగులకు 44 పరుగులు చెయ్యాలి.

సరే గెలుస్తుంది అనుకున్నాం… జర్నలిస్టులు వార్తలు కూడా రెడీ చేసుకున్నారు. పరువు నిలబెట్టుకున్న కీవీస్ అని. అప్పటికి 7 వికెట్లు చేతిలో ఉండటమే కాదు రాస్ టేలర్ లాంటి ప్రమాదకర ఆటగాడు క్రీజ్ లో ఉన్నాడు. ఛీ ఛీ పేక మేడలా కూలిపోయింది బ్యాటింగ్ లైనప్. అందుకే నేను ఒక సలహా ఇస్తున్నా… న్యూజిలాండ్ జట్టుకి మంచి జ్యోతిష్కుడు అవసరం అని చెప్తున్నా.

ఆ జట్టుకి ఏలిననాటి శని ఉంది. అందుకే ఓడిపోతుంది అనేది నా మాట. వరల్డ్ కప్ తర్వాత చెప్పా వాళ్లకి నలుపు కలిసి రాలేదని. అసలు ఆ జట్టు మేనేజ్మెంట్ కూడా వినట్లేదు ఈ మాట. జ్యోతిష్కుడు ఉంటే వాళ్లకు ఒక యాగం చేయించి, ఒక పవిత్ర నదిలో జట్టు మొత్తాన్ని ముంచి నక్షత్ర బలం ఆధారంగా ముందుకి వెళ్తే బాగుంటుంది. ఎవడూ వినడే…? ఏదైనా అనుకోండి ఆ జట్టుకి నలుపు కలిసి రాలేదు.” ఓ క్రికెట్ అభిమాని ఆవేదన…!

Read more RELATED
Recommended to you

Latest news