జమ్మూ: సాంబా జిల్లాలో హై అలర్ట్ ప్రకటించారు. పాక్ నుంచి డ్రోన్లు దూసుకొస్తూ ఉన్నాయి. ఇటీవల కాలంలో జమ్మూ ఎయిర్ పోర్టుపై డ్రోన్ల దాడి జరిగిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి జమ్మూపై ముష్కరులు విషం చిమ్ముతూనే ఉన్నారు. వరుసగా డ్రోన్లు పంపుతున్నారు. అయితే ముష్కరుల కన్నింగ్ తెలివితేటలకు భారత బలగాలు కల్లెం వేస్తునే ఉన్నాయి. అయినా బుద్ది తెచ్చుకోవడంలేదు. తాజాగా మరో మూడు డ్రోన్లను భారత్ వైపు పంపారు. బలగాలు అప్రమత్తమై కాల్పులు జరపడంతో అవి మాయమయ్యాయి.
గురువారం రాత్రి ఈ ఘటన జరిగింది. బ్రహ్మ, చలియారి, పఠాన్ కోట్ సమీపంలో మూడు డ్రోన్లు కలకలం సృష్టించాయి. గాల్లో నెమ్మదిగా డ్రోన్లు రావడాన్ని బీఎస్‌ఎఫ్ బలగాలు గమనించారు. వెంటనే అప్రమత్తమై డ్రోన్లపై కాల్పులు జరిపారు. అయితే డ్రోన్లు అక్కడి నుంచి తప్పింకుని వెనక్కి వెళ్లిపోయాయి. అయితే పలు అనుమానాలు వ్యక్తవుతున్నాయి. డ్రోన్లు ప్రవేశించిన ప్రాంతాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. డ్రోన్ల ద్వారా పాక్ ముష్కరులు భారీ కుట్రకు తెరతీసినట్లు తెలుస్తోంది.