హైదరాబాద్‌లో ‘డార్క్‌ వెబ్‌’ మత్తు దందా

-

డ్రగ్స్ సరఫరాపై తెలంగాణ ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. రాష్ట్ర పోలీసు యంత్రాంగం తెలంగాణను మత్తురహిత రాష్ట్రంగా మార్చేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. డ్రగ్స్ సరఫరాదారులు, వినియోగదారులపై గట్టి నిఘా పెట్టారు. ఈ క్రమంలో హైదరాబాద్ లో ఓ మత్తుదందా గుట్టు రట్టు చేశారు.

హుమాయున్‌ నగర్‌లో మాదక ద్రవ్యాలు విక్రయిస్తున్న అంతర్రాష్ట్ర ముఠాను పోలీసులు పట్టుకున్నారు. నిందితుల నుంచి 9 లక్షల విలువైన సరకును స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్స్‌ విక్రయిస్తున్న 8మందితో పాటు 30మంది వినియోగదారులను అరెస్ట్ చేశారు. ఇందులో ఇంజినీరింగ్‌ విద్యార్థులు, సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులు ఉన్నారని హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ వెల్లడించారు. డార్క్‌ వెబ్‌ ద్వారా మత్తుదందా నడిపిస్తున్నారని సీపీ తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news