హైదరాబాద్ లో మరో డ్రగ్స్ ముఠా.. ఆన్ లైన్ లో ‘ఆ’ పని కూడా !

హైదరాబాద్ లో డ్రగ్స్ ని అరికట్టేందుకు పోలీసులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా ఎక్కడో ఒక చోట ఈ దందా కొనసాగుతూనే ఉంది. తాజాగా హైదరాబాద్ లో డ్రగ్స్ ముఠా గుట్టు రట్టు చేశారు టాస్క్ ఫోర్స్ పోలీసులు. ఇక ఆ ముఠా ఆన్లైన్ ద్వారా వ్యభిచారం కూడా నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. అందమైన ఆకర్షణీయమైన యువతుల ద్వారా విటులు, అలాగే ఇతరులకు ఈ ముఠా హెడ్ డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.

పోలీసులు దాడి చేసే సమయానికి అతని వద్ద రెండు వందల గ్రాముల కొకైన్ ఉండగా దాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు అతన్ని కస్టడీలోకి తీసుకున్నారు. గోవా ఈశాన్య రాష్ట్రాల నుంచి అలాగే తమిళనాడు కర్ణాటక కేరళ రాష్ట్రాల నుంచి అందమైన యువతులను తీసుకొచ్చి ఈ యువకుడు వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఒక నైజీరియన్ ద్వారా అందిన సమాచారం మేరకు దాడులు చేయగా ఈ విషయాలు వెలుగులోకి వచ్చినట్లు చెబుతున్నారు.