జంగిల్ లో భయపెట్టననున్న ఆది సాయికుమార్.

-

ప్రేమ కావాలి చిత్రంతో ఇండస్ట్రీకి పరిచయమైన ఆది సాయికుమార్, ఆ సినిమాతో మంచి హిట్ అందుకున్నాడు. కానీ ఆ తర్వాత ఆది చేసిన చిత్రాలేవీ హీరోగా అతనికి సరైన గుర్తింపుని తీసుకురాలేకపోయాయి. గత కొన్ని ర్రోజులుగా వరుస ఫ్లాపులు వస్తూనే ఉన్నాయి. తాజాగా ఆది సాయికుమార్, తన కొత్త చిత్రాన్ని ప్రకటించాడు. జంగిల్ అనే టైటిల్ తో తెరకెక్కిన ఈ సినిమాతో ప్రేక్షకులని భయపెట్టడానికి వస్తున్నాడు.

ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ ఆసక్తి రేపుతుంది. దట్టమైన చీకట్లలో ఎదురుగా అస్థిపంజరాలు వేలాడుతుంటే వాటి మధ్యలో నుండి ఎటో వెళ్తున్నట్లుగా ఉన్న పోస్టర్, సినిమా కథాంశం ఏంటన్నది చెప్పేసింది. వేదిక హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా తెలుగుతో పాటు తమిళంలోనూ రిలీజ్ అవనుంది కార్తీక్ విగ్నేష్ దర్శకత్వం వహించిన ఈ సినిమాని మహేష్ గోవింద్ రాజ్, అర్చనా చందా సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మరి ఈ సినిమాతోనైనా ఆదికి మంచి హిట్ పడుతుందేమో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news