డ్రంక్ అండ్ డ్రైవ్ చేసేవాళ్ళు టెర్రరిస్ట్ లతో సమానమని సైబరాబాద్ సీపీ సజ్జనార్ పేర్కొన్నారు. ఈ వారం పాటు సైబరాబాద్ పరిధిలో ప్రత్యేక డ్రంక్ అండ్ డ్రైవ్ టీమ్స్ ఉంటాయని అయన పేర్కొన్నారు. ట్రాఫిక్, లా అండ్ ఆర్డర్, ఏఆర్ తో పాటు ఎస్వోటీ పోలీసులు కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ లో పాల్గొంటారన్న ఆయన తాగి రోడ్లపై డ్రైవ్ చేసేవారిని ఎవరిని వదలమని అన్నారు.
నిన్న ఒక్క రోజే 402 మంది తాగి వాహనం నడిపిన వారి పై కేసులు నమోదు చేశామన్న సజ్జనార్ ఇక మీదట సైబరాబాద్ పరిధిలో తాగి వాహనం నడిపితే ఐ పి సి 304 కింద కేసులు నమోదు చేసి 10 సంవత్సరాలు జైల్ శిక్ష పడేలా చూస్తామని అన్నారు. సైబరాబాద్ అనే కాదు ఎక్కడ తాగి దొరికినా కేసులు నమోదు చేసే అవకాశం పోలీసులకు ఉంటుంది. సో బీ కేర్ ఫుల్