హైదరాబాద్ లోని కోఠి వైద్య శాఖ కార్యాలయంలో మంత్రి ఈటెల సమీక్షా సమావేశం నిర్వహించారు. వైద్య శాఖ ఉన్నతాధికారులతో ఈటెల భేటీ అయ్యారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ యూకే స్ట్రెయిన్ భయంకరమైనది కాదని అన్నారు. దీనికి చంపే శక్తి ఎక్కువ లేదు, అని అయితే ఇది ఎక్కువ మందికి వ్యాప్తి చెందేలా చేస్తుంది అని నిపుణులు చెప్తున్నారని అన్నారు. అయితే దీనికి కూడా ప్రస్తుతం పాత పద్దతిలోనే చికిత్స అందిస్తున్నామని ఆయన అన్నారు.
10 నెలలుగా ప్రజలు భయంతో ఉన్నారు. ఇంకా ప్రచార మాధ్యమాలు ప్రజలను భయ పెట్టవద్దని ఆయన మీడియాని కోరారు. కరోనా వైరస్ చలికాలంలో వేగంగా వ్యాప్తి చెందే అవకాశం ఉంది కాబట్టి ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని ఆయన కోరారు. స్ట్రెయిన్ ప్రమాదకారి కాదన్న ఆయన వైరస్ ను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని అన్నారు. ఒక్క కేసుతోనే ఈ వైరస్ నీ కట్టడి చేస్తామని ఆయన అన్నారు. ప్రజలు పండుగల కన్నా ప్రాణాలు ముఖ్యం అని గ్రహించాలని ఇళ్ళల్లో నే ఉండి న్యూ ఇయర్ వేడుకలు జరుపుకోవాలని కోరారు.