చౌకబారు షాంపు తెచ్చిన లొల్లి.. ఆగిపోయిన పెళ్లి..!!

-

లవ్‌ మ్యారేజ్‌లో అయితే పెద్దగా పట్టింపులు, పంతాలు ఉండవు.. అప్పటికే వధూవరులు ఇద్దరు ఒకరినొకరు ఇష్టపడతారు కాబట్టి ఇక పెద్దలు వారికి నచ్చినా నచ్చుకున్నా పెళ్లి చేస్తారు.. కానీ అరేంజ్‌ మ్యారేజ్‌లో అలా కాదు.. ప్రతిదానికి పంతమే.. మగపెళ్లివారికి మర్యాదలు సరిగ్గా చేయకపోయినా, భోజనాలు బాలేకున్నా ఇలా ఏదైనా కావొచ్చు.. వారు హట్‌ అవడానికి.. చాలా పెళ్లిల్లో గొడవలు జరగటం సహజం.. కానీ పెళ్లి మాత్రం ఆగదు..ఇప్పుడు చెప్పుకోబోయే పెళ్లిలో కూడా గొడవ జరిగింది..కానీ ఏ విషయం మీద జరిగిందో తెలిస్తే మీరు షాక్ అవుతారు.. చౌకబారు షాంపు వల్ల పెళ్లి ఆగిపోయింది. ఓ చిన్న షాంపూ ఏకంగా పెళ్లినే ఆపేసిందంటే నమ్మగలరా? అవును.. అసోంలో అదే జరిగింది.
అసోంలో ఓ చిన్న షాంపూ ఏకంగా పెళ్లినే ఆపేసింది. సంప్రదాయం ప్రకారం.. వధువుకు వరుడి కుటుంబం ఇచ్చే వస్తువుల్లో చౌక రకం షాంపూ ఉండటమే ఈ వివాదానికి కారణమైంది. బార్పెటా జిల్లాలోని హౌలీ ప్రాంతంలో నివసించే ఓ యువతికి గువాహటిలోని ఇంజినీర్‌తో పెళ్లి నిశ్చయమైంది. వివాహానికి ముందు వరుడి కుటుంబం కొన్ని వస్తువులను వధువుకు పంపింది. వాటిలో బహుమతులు, ఇంట్లోకి ఉపయోగపడే వస్తువులు ఉన్నాయి. వాటిలో చౌకరకం షాంపూ ఉందన్న కోపంతో వధువు తనకు కాబోయే భర్తపై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది.
‘నీ స్థాయి ఇంతేనా?’ అంటూ కోపంతో వాట్సప్‌లో మెసేజ్‌ చేసింది. షాక్‌కు గురైన వరుడు.. మరో ఆరు గంటల్లో జరగాల్సిన వివాహాన్ని వెంటనే రద్దు చేసుకున్నాడు. ఈ నెల 14న ఈ ఘటన జరిగింది. విషయం తెలియగానే అమ్మాయి తరఫువారు సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. యువతిని క్షమించి, వివాహం జరిగేలా చూడాలని కోరారు. అయినా వరుడి అస్సలు తగ్గలేదు..పెళ్లి చేసుకోని అని కరాకండీగా చెప్పాడు.. దాంతో వధువు కుటుంభీకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
చిన్న షాంపు కాస్త పెద్ద పెళ్లిని ఆపేసింది.. షాంపు నచ్చకపోతే ఆ వధువు వాడకుండా పక్కనేసేయొచ్చు కదా.. పోయి పోయి వరుడికి అలా మెసేజ్‌ చేయడం ఏంటని విషయం తెలిసిన నెటిజన్లు అంటున్నారు. ఇజ్జత్‌కా సవాల్‌ అనుకున్నాడేమో వరుడు అసలు నువ్వు వద్దు, నీ పెళ్లి వద్దు అన్నాడు.. మరీ పోలీసులు ఈ పంచాయితీని ఎలా తెలుస్తారో చూడాలి..!!

Read more RELATED
Recommended to you

Latest news