కొమురవెల్లి మల్లన్నకు కానుకగా రూ.కోటి విలువైన కిరీటం

-

కొమురవెల్లి మల్లికార్జున స్వామి కల్యాణం కన్నులపండువగా జరిగింది. ఈ కల్యాణ మహోత్సవంలో రాష్ట్ర మంత్రులు హరీశ్ రావు, మల్లారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు. మంత్రి హరీశ్ రావు మల్లన్న స్వామికి కోటి రూపాయలు విలువ చేసే బంగారు కిరీటాన్ని సమర్పించారు. అంతకుముందు ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు సమర్పించారు.

రాష్ట్రంలోని అన్ని దేవాలయాలను దేశంలోని ఏ రాష్ట్ర ప్రభుత్వ చేయని విధంగా అభివృద్ధి చేస్తున్నామని మంత్రి హారీశ్‌రావు తెలిపారు. మల్లన్న ఆలయానికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ రూ.30కోట్లు కేటాయించారని అన్నారు. రూ.1,100 కోట్లతో యాదాద్రి నిర్మాణం జరగడం సంతోషకరమని చెప్పారు. కొండగట్టు అంజన్న ఆలయానికి రూ.100 కోట్లు కేటాయించినట్లు వెల్లడించారు. ఉత్తర తెలంగాణలో జాతర అంటే.. మల్లన్న జాతరేనన్న మంత్రి.. వచ్చే ఏడాది మేడమ్మకు, ఖేతమ్మకు కూడా బంగారు కిరీటాలను చేయిస్తామని ప్రకటించారు. బృహన్మఠాధీశుడు సిద్దగురు మణికంఠ శివచార్యుల పర్యవేక్షణలో కొమురవెల్లి మల్లన్న కల్యాణోత్వాలు వైభవోపేతంగా నిర్వహిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news