CSK కీలక నిర్ణయం..జొహన్నెస్‌బర్గ్‌ కెప్టెన్‌గా డుప్లెసిస్‌ !

-

సీఎస్ కె పాత మిత్రులు స్టీఫెన్ ఫ్లెమింగ్, డూప్లెసెస్ మళ్లీ జట్టు కట్టనున్నారు. సిఎస్ కే యాజమాన్యం దక్షిణాఫ్రికా టీ 20 లీగ్ లో కొనుగోలు చేసిన జోహన్ నెస్ బర్గ్ సూపర్ కింగ్స్ కోసం ఇద్దరూ కలిసి పని చేయనున్నారు. ఈ జట్టుకు ప్లేమింగ్ కోచ్ కాగా, డూప్లెసెస్ సారథ్యం వహించనున్నాడు. ఐపీఎల్ మెగా వేలానికి ముందు చెన్నై డూప్లెసీస్ ను విడుదల చేశాక ఈ ఏడాది బెంగుళూరుకు సారథ్యం వహించి జట్టును ప్లేఆప్స్ కు చేర్చాడు. క్రికెట్ దక్షిణాఫ్రికా (సిఎస్ ఏ) టీ 20 లీగ్ లో ఓ మినీ సి ఎస్ కె జట్టే బరిలోకి దిగబోతోంది.

ఎందుకంటే మోయిన్ అలీ, మహేష్ తీక్షన, రోమారియో షెఫర్డ్ లు కూడా జోహాన్నెస్ బర్గ్ జట్టులో ఉన్నారు. ఆటగాళ్లే కాదు, కోచింగ్ సిబ్బంది కూడా సిఎస్ కె తోనే నిండిపోతుంది. ఫ్లెమింగ్ హెడ్ కోచ్ గా, ఎరిక్ సిమాన్స్ సహాయ కోచ్ గా వ్యవహరిస్తారు. ఒకప్పుడు సిఎస్ కేకు ఆడిన దక్షిణాఫ్రికా ఆల్ రౌండర్ ఆల్బి మోర్కేల్ ను కూడా జోహన్ నెస్ బర్గ్ జట్టు కోచింగ్ సిబ్బందిలో నియమించనున్నట్లు తెలిసింది. వచ్చే ఏడాది ఆరంభంలో సి ఎస్ ఏ టి 20 లీగ్ జరిగే అవకాశం ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news