అరుణాచల్ లో భూకంపం.. 4.1 తీవ్రతతో కంపించిన భూమి

-

హిమాలయాల ప్రాంతం భూకంపంతో మరోసారి కంపించింది. అరుణాచల్ ప్రదేశ్ లో భూకంపం చోటు చేసుకుంది. శనివారం ఉదయం భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పై 4.1 తీవ్రతతో భూకంపం వచ్చింది. భూకంప కేంద్రం అరుణాచల్ రాష్ట్రం బాసర్ నుంచి 145 కిలోమీటర్ల దూరంలో ఉంది. 10 కిలోమీటర్ల లోతులో భూకంపం కేంద్రీక్రుతం అయిందని నేషనల్ సెంటర్ ఫర్ సెస్మాలజీ ట్విట్టర్ లో వెల్లంచింది. హిమాలయ రీజియన్లో సాధారణంగా భూకంపాలు సంభవిస్తుంటాయి. ఈశాన్య రాష్ట్రాలతో పాటు హిమాలయ పర్వత సమీప రాష్ట్రాలు భూకంప పరిధి ప్రాంతంలో ఉన్నాయి. గతంలో కూడా ఈ ప్రాంతాల్లో సాధారణ భూకంపాల నుంచి భారీ భూకంపాలు సంభవించాయి. మన దేశంతో పాటు నేపాల్, భూటాన్ దేశాలు భూకంపాలు సంభవించే ప్రాంతాల జాబితాలో ఉన్నాయి.

earthquake

2015లో నేపాల్ లో వచ్చిన తీవ్ర భూకంపం మూలంగా ఆదేశం తీవ్రంగా నష్టపోయింది. 7.8 తీవ్రతతో వచ్చిన భూకంప ధాటికి దాదాపుగా 9 వేల మంది మరణించారు. 22 వేల మంది గాయపడితే దాదాపు 30 లక్షల మందిపై భూకంపం ప్రభావం చూపింది.

Read more RELATED
Recommended to you

Latest news