గుప్పెడంతమనసు ఎపిసోడ్ 258 : సీన్ అదిరింది..వసూ పడిపోతుంటే పట్టుకున్న రిషీ..స్టన్ అయిపోయిన వసుధార

-

గుప్పెడంతమనసు ఈరోజు ఎపిసోడ్ లో జగతి-మహేంద్రలు ఒక దగ్గర కుర్చుని ఉంటారు. మహేంద్ర సారి జగతి..జరిగిందానికి నేను ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియటం లేదు అంటాడు. కొత్తగా ఏం జరిగింది మహేంద్ర అంటుంది. నేను రిషీ మీద అరిచాను, రిషీ నిన్ను చాలా మాట్లాన్నాడు అంటాడు. జగతి..నేనే రిషిని వదిలేసి వెళ్లాల్సిందికాదు అంటూ గతం గురించి మాట్లాడుకుంటారు. ఇంట్లోంచి వెళ్లిపోయి తప్పు చేశానేమో అనిపిస్తుంది అంటుంది జగతి. ఇంత జరిగాక..ఇప్పుడు తప్పుఒప్పుల గురించి ప్రస్థావన అవసరమా అంటాడు మహేంద్ర. రిషీని చూస్తుంటే తల్లిలేని లోటు స్పష్టంగా కనిపిస్తుంది అంటుంది జగతి. మహేంద్ర జరిగిందాని గురించి ఆలోచించటం ఆపేసి..జరగబోయేదాని గురించి ఆలోచిస్తే మంచిదేమో అంటాడు. ఏం జరుగుతుంది మహేంద్ర..రాత్రిరాత్రే అద్భుతాలు జరగవ్ కదా అంటుంది. మహేంద్ర నువ్వే అన్నావ్ కదా జగతి.. రిషీ మనసులో వసూ ఉందని..ఒకవేళ వసూ మనసులో రిషీ ఉంటే వాళ్లిద్దరు ఒక్కటైతే నువ్వు కూడా దగ్గరైనట్లే కదా అని మహేంద్ర అంటాడు. ఆ మాటకు జగతి నువ్వు కూడా అప్పుడప్పుడు చిన్నపిల్లాడిలా ఆలోచిస్తావ్ మహేంద్ర..ఒక వేళ వాళ్లిద్దరు ఒక్కటైతే…రిషీ నీకు నేను కావాలా, జగతి కావాలా అంటే వసూ రిషీ కోసం నన్ను కాదన్నా ఆశ్యర్యమేం ఉంటుంది చెప్పు..అలా వెళ్లటమే కరెక్ట్ కూడా అంటుంది. మహేంద్ర జగతితో..నువ్వు రిషీలానే ఆలిచిస్తావంట శిరీష్ చెప్పాడు అంటాడు. నా కొడుకే కదా అంటుది జగతి.

మహేంద్ర జగతికి ఊరట కలిగించే మాటలు చెప్తాడు..వసూ రిషీని మారుస్తుంది అదిఇదీ అని. కానీ జగతి మాత్రం..మాటలతో నా మనసుకి ఊరట కలిగించాలని చూడకు, బాధలే నాకు బంధువులు, ఒంటరితనమే నాకు ఓదార్పు అంటూ బాధపడుతుంది. అలా ఆ సీన్ అయిపోతుంది.

ఇంకోవైపు కారులో వెళ్తున్న రిషీ వసుధార నిన్ను ఒక ప్రశ్న అడగాలి అంటాడు. ఏంటి సార్ పెళ్లి గురించా అంటుంది. నువ్వు క్లియర్ గా చెప్పావ్ కాదా ఇంకా దాని గురించే ఎందుకు అడుగుతాను అని…నీకు ఇన్నీ బాధలు, కష్టాలు ఉన్నాయ్ కదా ఇంత సంతోషంగా ఎలా ఉండగలుగుతున్నావ్ అంటాడు. వసూ స్టాట్ చేయబోతుంది..రెండు మార్కులు ప్రశ్నలా చెప్పు అసలే ఆకలిగా ఉంది ఓపికలేదు అంటాడు. వసూ డబ్బుకి, సంతోషాలకు సంబంధంలేదు. మనీలో కాదు, మనసులో ఉండాలి సార్ అంటుంది. రిషీ ఏం మాట్లాడడు. వసూ సార్ సార్ ఆపండి, ఆకలేస్తుంది అన్నారుకదా, మీకు అద్భుతమైన స్నాక్ తినిపిస్తాను అంటుంది. కారు దిగి మొక్కజొన్న కంకులను చూపిస్తుంది. రిషీ అవసరమా ఇప్పుడు అంటాడు. టేస్టీగా ఉంటాయ్ సార్ అని రీషీ చేయి పట్టుకుని తీసుకెళ్తుంది.

భయ్యా ఒకటి ఎంత అని అమ్మే వ్యక్తిని వసూ అడుగుతుంది. రిషీ ఏంటి నువ్వు బేరాలాడాలా ఇప్పుడు అంటాడు. వసూ కారులోంచి దిగామని ఖరీదు ఎక్కువ చెప్తారు సార్, బేరాలాడటంలో కూడా మంచి మజా ఉంటుంది సార్ అంటుంది. 20రూపాయలు ఒకటి అంటాడు. సర్లే న్యాయమైన రేటే అని లేత లేత కంకులు ఏరి బాగా కాల్చాలి, ఇలా ఉండాలి, అలా ఉండాలి అంటుంది. పాపం ఆ అమ్మే వ్యక్తికి ఏం అర్థంకాదు..సరే నేను కాలుస్తానులే అని వసూయేకాల్చుతుంది. రిషీ ఏంటి వసుధార అంటే..పల్లే నుంచి వచ్చిన అమ్మాయిని సార్ నాకు ఇవ్వన్నీ వచ్చు సార్ అంటుంది. వసూ అలా మొక్కజొన్నలు కాల్చుతుంటే..రిషీ అలా చూస్తూ ఉండిపోతాడు. మనసులో వసుధార సంథింగ్ స్పెషల్ అనుకుంటాడు. కాల్చటం అయిపోతుంది. ఉప్పు,కారం, నిమ్మకాయ అద్దితే ఉంటుంది సార్ సూపర్ అని అంటుతూ ఉంటుంది…ఇంతలో వేరేవాళ్లు వాళ్లు ఏమ్మా ఎలా ఇస్తున్నావ్ అని అడుగుతారు. 25 చెప్తున్నాను కానీ 20కి తీసుకోండి అంటుంది. వసూ పక్కకు వచ్చి కాల్చిన కంకులు రిషీకి ఇచ్చి తినమని చెబుుతంది. రిషీకి వాటిని తినటం కూడా రాదు..వసూ ఇలా తినాలి అని చెప్తుంది. ఇద్దరు తింటారు. చేయ్ కడుక్కుంటారు. రిషీ షట్ పైన వాటర్ పడితే..వసూయే కర్ఛీఫ్ తో తుడుస్తుంది. రిషీ ఏం చేస్తున్నాం అంటే..మీరు ప్రిన్స్ కదా సార్ అందుకే అంటుంది. ఈ క్షణాలు ఎంత ఆనందంగా గడిచాయో కదా అంటుంది.

మరోవైపు జగతి, శిరీష్ ఎడ్యూకల్చర్ గురించి ప్రోగ్రామ్ డిజైన్ చేస్తారు. వాయిస్ ఓవర్ చేయాల్సి ఉంటుంది. అది ఎ‌వరు చేస్తున్నారు అని శిరీష్ అడుగుతాడు, వసుధారకు చెప్పాను చేస్తుంది అని జగతి చెబుతుంది. వసూ చెట్టుకింద కుర్చుని వాయిస్ ఓవర్ కి ఏం రాయాలా అని ఆలోచిస్తూ..పేపర్ మీద రాస్తూ ఉంటుంది.ఇంతలో రిషీ కారులో వచ్చి ఫోను మాట్లాడుతూ ఉంటాడు. వసూ రాసే పేపర్ గాలికి ఎగిరి రిషీ కారుపై పడుతుంది. రిషీ ఏంటా అని చదవబోతాడు..ఇంతలో వసూ వచ్చి పేపర్ తీసుకుంటుంది. రిషీ కారు దిగి హలో అంటాడు. అప్పటివరకూ వసూ రిషీని చూసుకోదు..సడన్ గా సార్ అని ముందుకు అడుగువేయబోతుంది..స్లిపై కిందపడబోతుంది. రిషీ నడుంపై చేయ్ వేసి పట్టుకుంటాడు. అలా పట్టుకునే ఏంటిది అంటాడు..వసూ చెప్తుంది. సరే నీకు ఓకే కదా అని రిషీ అడుగుతాడు. హా ఓకే సార్ అని వసూ కుంటుకుంటూ మళ్లీ చెట్టుకిందకు వెళ్తుంది. అదిచూసిన రిషీ ఏమైంది అంటాడు. ఏం లేదు సార్ చిన్న ప్రాబ్లమ్ అంటుంది. అలా ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది. తరువాయి భాగంలో మరి ఈ ఇగో మాష్టర్ వసూ కాలునొప్పికి ఏమైనా చికిత్స చేస్తాడేమే చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news