ఇటీవల టర్కీ, సిరియాల్లో భూకంపం సృష్టించిన విధ్వంసానికి ప్రపంచమంతా దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఈ భూకంపాన్ని ముందే గ్రహించిన పరిశోధకులు.. ఆ తర్వాత భూకంపాలు వచ్చే ప్రమాదమున్న దేశాలపై పరిశోధనలు సాగించారు. ఈ క్రమంలో వారు ఇండియాలో కూడా త్వరలోనే భూకంపం సంభవించే ప్రమాదముందని తేల్చారు.
పరిశోధకులు చెప్పిట్టుగానే అప్పటి నుంచి భారత్లోని పలు రాష్ట్రాల్లో స్వల్ప భూప్రకంపనలు మొదలయ్యాయి. తాజాగా ఇది తెలుగు రాష్ట్రాలకూ పాకింది. ఇవాళ ఉదయం తెలంగాణలోని సూర్యాపేట జిల్లాలో భూకంపం వచ్చింది. కృష్ణానది తీర ప్రాంతంలోని చింతలపాలెం, మెళ్లచేరువు మండలాల్లో ఉన్న పలు గ్రామాల్లో ఆదివారం ఉదయం 7.25 గంటలకు భూమి కంపించింది. సుమారు 10 సెకన్ల భూ ప్రకంపణలు చోటుచేసుకున్నాయి. దీంతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. ఈ మండలాల్లో గతంలోనూ పలుమార్లు భూమి కంపించించి.
ఇక ఆంధ్రప్రదేశ్‌లోని పులిచింతల ప్రాజెక్టు వద్ద కూడా ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. మాదిపాడులోని జడేపల్లి తండా, కంచిబోడు తండాల్లో భూకంపం వచ్చింది. ఆదివారం ఉదయం స్వల్వ వ్యవధిలో భారీ శబ్ధంతో రెండుసార్లు భూమి కంపించిందని స్థానిలు వెల్లడించారు. ఒక్కసారిగా భూమి కంపించడంతో ఇండ్లలోనుంచి బయటకు పరుగులుతీశారు.