వివాదంగా వైసీపీ పోస్టర్..జగన్‌పై సోము ఫైర్..హిందువులకు క్షమాపణ!

-

శివరాత్రి సందర్భంగా అధికార వైసీపీ అధికారిక ట్విట్టర్ ఖాతాలో శివరాత్రి శుభాకాంక్షలు తెలుపుతూ..ఒక పోస్టర్‌ని పోస్టు చేసింది. ఆ పోస్టర్‌లో సి‌ఎం జగన్.. బాల శివుడుకు పాలు తాగిస్తున్నట్లు ఫోటో ఉంది. అలాగే “అన్నార్తుల ఆకలి తీర్చడమే ఈశ్వరారాధాన. ఆ శివయ్య చల్లని దీవెనలు రాష్ట్ర ప్రజలందరి పై ఉండాలని కోరుకుంటూ…శివరాత్రి పర్వదినం సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు.” అని పోస్టు చేశారు.

అయితే అలా శివుడుకు పాలు తాగిస్తున్నట్లు ఉన్న ఫోటోపై ఏపీ బి‌జే‌పి అధ్యక్షుడు సోము వీర్రాజు ఫైర్ అయ్యారు. సీఎం జగన్.. బాల శివుడికి పాలు పట్టిస్తున్న పోస్టర్‌ను వైసీపీ అధికారిక ట్విట్టర్ ఖాతా నుంచి వెంటనే తొలగించాలని, వైఎస్ జగన్ భేషరతుగా హిందువులకు క్షమాపణ చెప్పాలని సోమువీర్రాజు డిమాండ్ చేశారు. వైసీపీ ట్విట్టర్‌లో పోస్టు చేసిన చిత్రంపై బీజేపీ సీరియస్ అయ్యింది. అలాగే రాష్ట్రవ్యాప్తంగా శివాలయాలు వద్ద ఆందోళనలకు పిలుపునిచ్చినట్లు సోమువీర్రాజు తెలిపారు.

వైసీపీ పార్టీ హిందువులను ఉద్దేశపూర్వకంగా అవమానించిందని నిరసన కార్యక్రమాలు చేపడుతున్నట్లు ఫైర్ అయ్యారు. అయితే వైసీపీ-బీజేపీల మధ్య సీక్రెట్ గా రహస్య స్నేహం కొనసాగుతుందనే తరుణంలో..జగన్‌కు సోము పరోక్షంగా సపోర్ట్ ఇస్తున్నారనే విమర్శలు వస్తున్న నేపథ్యంలో సోము..జగన్ పై ఫైర్ అవ్వడం కొత్త చర్చకు దారితీసింది. అలాగే హిందువులకు క్షమాపణ చెప్పాలంటూ డిమాండ్ చేస్తున్నారు.

అయితే ఓవైపు వైసీపీతో స్నేహంగా నటిస్తూనే మరోవైపు ఆ పార్టీని ఇరుకునపెట్టే వ్యూహాలు రచిస్తోందని తెలుస్తోంది. ఇక భవిష్యత్తులో ఆ పార్టీని ఇరుకునపెట్టేందుకు ఇప్పటి నుంచే వ్యూహాలకు పదునుపెడుతోందని సమాచారం. మరి సోము వ్యాఖ్యలపై వైసీపీ ఎలా స్పందిస్తుందనేది చూడాలి. అలాగే ఆ పోస్టర్‌ని డిలీట్ చేస్తుందో లేదో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news