ఉత్తరాఖండ్‌లో భారీ భూకంపం..

ఉత్తర భారత రాష్ట్రమైన ఉత్తరాఖండ్ లో భారీ భూకంపం సంభవించింది. ఇవాళ ఉదయం పూట సుమారు ఆరు గంటల ప్రాంతం లో… ఉత్తరాఖండ్ భూకంపం సంభవించింది. ఆ రాష్ట్రంలోని జోషిమఠ్ లో భూమి కన్పించిందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మలజి స్పష్టం చేసింది. దీని తీవ్రత రిక్టర్ స్కేల్ పై 4.6 గా నమోదైనట్లు కూడా తెలిపింది నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజి.

జోషిమఠ్ కు 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న పిపల్ కోటి వద్ద భూకంప కేంద్రం ఉందని పేర్కొంది. భూకంప ప్రభావం కారణంగా జోషిమఠ్ లో భవనాలు స్వల్పంగా కంపించాయి. ఇక భూకంపం సంభవించడం తో అక్కడి ప్రజలు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. అంతేకాదు భూకంపం వచ్చింది అన్న భయం కారణంగా ప్రజలు తమ ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. కాగా ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం భూకంపం… కారణంగా ఎలాంటి ప్రాణ మరియు ఆస్తి నష్టం జరగలేదని ఉత్తరాoఖడ్ కు చెందిన అధికారులు స్పష్టం చేశారు.