ఇండియా కరోనా అప్డేట్ : 24 గంటల్లో 33,376 కేసులు

ఇండియా లో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతూనే ఉంది. మొన్నటి వరకు తగ్గిన కరోనా కేసులు ఇప్పుడు మళ్ళీ విజృంభిస్తున్నాయి. ఇక ఇవాళ కరోనా కేసులు కాస్త తగ్గాయి. నిన్నటి రోజున పెరిగిన కరోనా కేసులు…ఇవాళ మాత్రం తగ్గాయి. గడిచిన 24 గంటల్లో దేశంలో 33,376 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశ వ్యాప్తంగా మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,32,08,330 కు చేరింది.

ఇక దేశంలో యా క్టివ్ కరోనా కేసుల సంఖ్య 3,91,516 కు చేరింది. ఇక దేశం లో కరోనా పాజిటివిటి రేటు 98.06 శాతంగా ఉంది. ఇక దేశంలో తాజాగా 308 మంది కరోనా తో మరణించగా మృతుల సంఖ్య 4,42,317 కి చేరింది. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 32, 198 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇక దేశ వ్యా ప్తంగా ఆ రికవరీ ల సంఖ్య 3,23,74,497 కు చేరింది. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 73,05,89,688 మందికి కరోనా వ్యాక్సిన్లు చేసింది కేంద్ర ఆరోగ్య శాఖ. ఇక గడిచిన 24 గంటల్లో 65,27,175 మందికి కరోనా వ్యాక్సిన్లు వేసింది ఆరోగ్య శాఖ.