పొద్దున్న లేవగానే చాయ్ కప్పు చేతికి అందకపోతే గోల గోల చేసేవాళ్ళు చాలామంది. వేడి వేడి టీ నోట్లో పడితే గానీ వారి నుండి నోటి నుండి మంచి మాటలురావు. ఐతే ప్రతీరోజూ చాయ్ తాగి బోర్ గా ఫీలయ్యేవాళ్ళూ ఉన్నారు. అలాగే, ఎక్కువ సార్లు ఛాయ్ తాగడం ఆరోగ్యానికి మంచిది కాదనుకునే వాళ్ళూ ఉన్నారు. ఇలా ఆలోచించే వాళ్ళు మీ ఫ్యామిలీలో ఉన్నట్లయితే ఛాయ్ కి బదులు ఈ జ్యూస్ తయారు చేసుకోండి. ఆరోగ్యానికి ఆరోగ్యంతో పాటు రుచికి రుచి ఈ జ్యూస్ సొంతం.
మరింకెందుకు ఆలస్యం ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడే తెలుసుకోండి.
దీనికి కావాల్సిన పదార్థాలు
ఒక సొరకాయ ( దీన్ని ముక్కలుగా కోసుకోవాలి)
ఒక దోసకాయ
సెలెరీ
పుదీనా
నిమ్మరసం
జీలకర్ర పొడి
కొద్దిగా ఉప్పు
తయారీ పద్దతి
ఈ పదార్థాలన్నింటినీ ఒక పాత్రలో వేసి గ్రైండ్ చేయాలి. ఆ తర్వాత వచ్చిన మిశ్రమాన్ని వడపోయాలి. అంతే, ఇప్పుడు ఈ జ్యూస్ ని హాయిగా సేవించవచ్చు.
ఈ జ్యూస్ వల్ల కలిగే లాభాలు
ఇది రక్తాన్ని శుద్ధి చేస్తుంది. శరీరంలోని ఇతర విష పదార్థాలను బయటకి పంపించివేస్తుంది. అంతేకాదు ఎర్రరక్తకణాల ఉత్పత్తిలో కీలకంగా ఉంటుంది.
విటమిన్లు, పోషకాలు ఎక్కువగా ఉండడం వల్ల కళ్ళ ఆరోగ్యానికి, రోగనిరోధక శక్తికి మేలు చేస్తుంది.
ఇది కాలేయంలో పేరుకుపోయిన కొవ్వును కరిగిస్తుంది. అంతేకాదు గుండెను ఆరోగ్యంగా ఉంటుంది.
పిత్తాశయ ఆరోగ్యాన్ని మెరుగ్గా ఉంచుతుంది. దీనివల్ల శరీరంలో వ్యర్థ పదార్థాలు బయటకు వెళ్ళిపోతాయి.