అంద‌మైన పెద‌వుల కోసం ఈజీ టిప్స్‌..!

-

అంద‌మైన ఆడ‌వాళ్ల‌కు అందాన్ని మ‌రింత రెట్టింపు చేసే వాటిలో పెద‌వులు అని చెప్ప‌వ‌చ్చు. అంద‌మైన, మృదువైన, ఎర్ర‌ని పెద‌వులు కోరుని వారుండ‌రు.పెదాలు డల్‌, డార్క్, మ‌రియు పగిలినట్టుగా ఉంటే చాలా ఇబ్బంది ప‌డ‌తారు. పర్యావరణ కాలుష్యం, కఠినమైన వాతావరణ పరిస్థితులు మరియు కాస్మెటిక్స్ ను ఎక్కువగా వాడటం వ‌ల్ల పెద‌వుల‌పై దుష్ప్రభావాన్ని చూపిస్తాయి. అయితే ఇలాంటి స‌మ‌స్య‌ల‌కు చెక్ పెట్ట‌డానికి..పెదవులు తేమగా మ‌రియు అందంగా ఉండడానికి కొన్ని టిప్స్‌ పాటిస్తే స‌రిపోతుంది. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.


– గులాబీ రేకుల‌ని పాల‌లో వేసి పేస్ట్‌లా చేసుకోవాలి. ఈ మిశ్ర‌మాన్ని పెద‌వుల‌కు మృదువుగా అప్లై చేసుకోవాలి. ఈ చేయ‌డం వ‌ల్ల పెద‌వులు స‌హ‌జ‌మైన క‌ల‌ర్‌ను పొంద‌వ‌చ్చు.

– తేనెలో కొంచెం పంచ‌దార మిక్స్ చేసి పెద‌వుల‌కు అప్లై చేయాలి. కొంత స‌మ‌యం త‌ర్వాత వాష్ చేసుకుంటే పెదువుల‌పై ఉన్న మురికి తొలిగి అందంగా క‌నిపిస్తాయి.

–  ప్ర‌తి రోజూ పడుకునే ముందు ఆలివ్ ఆయిల్‌ను పెదాలపై మసాజ్ చేయాలి. రాత్రంతా అలాగే ఉంచుకుని మార్నింగ్ వాష్ చేయాలి. ఇలా చేయడం వల్ల పెదవులు తేమవంతంగా మారుతాయి.

– పచ్చి బంగాళాదుంప ముక్కల్ని పెదవులకు మృదువుగా మ‌సాజ్ చేసుకుంటే పెదవులు మెత్తబడడంతో పాటు నల్లని పెదవులు గులాబీ రంగులోకి వ‌స్తాయి.

– ప్ర‌తి రోజు క‌ల‌బంద జెల్‌ను పెద‌వుల‌కు అప్లై చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల పెద‌వులు పొడిబార‌డాన్ని త‌గ్గిస్తుంది.

– ట‌మాటాలో కొంచెం పెరుగు మిక్స్ చేసి పెద‌వులు బాగా మ‌సాజ్ చేయాలి. ఇలా ప్ర‌తి రోజు చేయ‌డం వ‌ల్ల పెద‌వులు అందంగా, ప్ర‌కాశవంతంగా క‌నిపిస్తాయి.

– కుంకుమపువ్వు, పెరుగు బాగా మిక్స్ చేసి పెద‌వుల‌కు అప్లై చేయాలి. ఇలా త‌ర‌చూ చేయ‌డం వ‌ల్ల పెద‌వులు మృదువుగా మ‌రియు తేమ‌గా ఉంటాయి.

Read more RELATED
Recommended to you

Latest news