రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ లేకపోయినా ఇలా ఈజీగా ఆధార్ కార్డు ని డౌన్ లోడ్ చేసేయచ్చు…!

మనకి వుండే ముఖ్యమైన డాక్యుమెంట్స్ లో ఆధార్ కార్డు కూడా ఒకటి. ఆధార్ వలన ఎన్నో లాభాలు ఉంటాయి. చాలా వాటి కోసం ఆధార్ తప్పక ఉండాలి. ప్రభుత్వ పథకాల నుంచి ఆర్థిక లావాదేవీల వరకు ఆధార్ కావాలి. ఆధార్‌తో అనుసంధానం చేయాలన్నా లేదంటే మిగిలిన వాటికి అయినా కూడా రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ లేకపోతే అవ్వదు.

యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆధార్ కార్డు హోల్డర్స్‌కు వెసులుబాట్లు కల్పిస్తూ వస్తోంది. ఆన్‌లైన్ ద్వారా ఇ-ఆధార్ డౌన్‌లోడ్ కూడా ఒకటి. దీనికి కూడా రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ అవసరం. ఇప్పుడు మొబైల్ నంబర్ లేకుండా కూడా ఆధార్ కార్డు ని డౌన్లోడ్ చేసేయచ్చు. దీని కోసం గతంలోనే యూఐడీఏఐ ఓ ప్రకటన చేసింది. రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ లేకుండానే ఆధార్ కార్డు డౌన్‌లోడ్ చేసేయచ్చు. అధికారిక వెబ్‌సైట్‌ లో వివిధ ఆప్షన్లను కూడా అందుబాటులోకి తీసుకు రావడం జరిగింది. దీనితో రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ లేని వారికి ఊరట లభించనుంది. ఇక అది ఎలానో చూద్దాం.

మొదట యూఐడీఏఐ అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్ళండి.
ఇక్కడ మీరు మై ఆధార్ ఆప్షన్ ని ఎంపిక చెయ్యండి. ఆ తరవాత ఆర్డర్ ఆధార్ పీవీసీ కార్డ్‌పై క్లిక్ చేయాలి.
12 అంకెల ఆధార్ సంఖ్యను ఎంటర్ చేసేసి 16 అంకెల వర్చువల్ ఐడెంటిఫికేషన్ నంబర్ కూడా ఇచ్చేయినది.
క్యాప్చా కోడ్ ఎంటర్ చేయాలి. రిజిస్టర్ మొబైల్ నంబర్ లేకుండా కార్డు డౌన్‌లోడ్ చేయాలంటే…. నా మొబైల్ నంబర్ ధ్రువీకరణ కాలేదు అనేది సెలెక్ట్ చేయండి.
సెండ్ ఓటీపీపై క్లికే చేస్తే కొత్త మొబైల్ నంబర్ ఎంటర్ చేయమంటుంది. మీరు అందించే మొబైల్ నంబర్‌కు ఓటీపీ వస్తుంది. దాన్ని ఎంటర్ చేసేయండి.
రీప్రింటింగ్ వెరిఫికేషన్ కోసం ఆధార్ కార్డు ప్రింట్ ప్రీవ్యూ కనపడుతుంది. ఫైనల్ గా పేమెంట్ ఆప్షన్ ని ఎంచుకుని పూర్తి చేయండి.