Khiladi: దీపావళికి మాస్ మ‌హ‌రాజా ‘ఖిలాడి’ పాట..

-

Khiladi : మాస్ మ‌హ‌రాజా ర‌వితేజ హీరోగా ర‌మేశ్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న చిత్రం ‘ఖిలాడి’. యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందిన ఈ చిత్రంలో ర‌వితేజ డ్యూయెల్ రోల్ చేస్తున్నాడు. ఇందులో డింపుల్ హయాతి, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్‌ స్వరాలందించారు.

సత్యనారాయణ కోనేరు నిర్మాత కాగా.. ప్రస్తుతం పోస్టు ప్రోడ‌క్ష‌న్ వ‌ర్స్ జరుపుకుంటున్న ఈ సినిమా.. త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతుండగా.. సినిమాకు సంబంధించి ఇప్పటికే విడుదలైన లుక్స్, ఫస్ట్ సింగిల్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. దీంతో ఈ సినిమాపై భారీ అంచనాలే నెల‌కొన్నాయి.

తాజాగా మాస్ మ‌హారాజా త‌న ప్లాన్స్ కి దీపావళి కానుకగా ఇవ్వ‌డానికి ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. నవంబర్ 4 న ఉదయం 10గంటల 8నిమిషాలకు దీపావళి కానుకగా సెకండ్ సింగిల్ విడుదల చేయ‌నున్నారు. ఈ విషయాన్ని చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. ఈ త‌రుణంలో ఓ కొత్త పోస్టర్‌ను విడుద‌ల చేశారు. ఆ పోస్టర్‌లో రవితేజ ఎడారిలో నడిచి వెళ్తూ కనిపించారు.

ఇదిలా ఉంటే.. క్రాక్ మూవీ భారీ హిట్‌ తర్వాత రవితేజ్‌ వరుసగా ప్రాజెక్ట్స్‌ ను లైన్‌ లో పెడుతున్నాడు. ఖిలాబీ సినిమా షూటింగ్‌ పూర్తి అయింది. రామారావు ఆన్‌ డ్యూటీ అనే చిత్రం షూటింగ్ ద‌శ‌లో ఉంది. ఇక ఇటీవలే ధమాకా ఫస్ట్‌ షెడ్యూల్‌ పూర్తి చేశారు రవితేజ.

Read more RELATED
Recommended to you

Latest news