మీరు ఉద్యోగం కోసం చూస్తున్నారా…? అయితే మీకు ఇది గుడ్ న్యూస్. హైదరాబాద్లోని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్-ECIL ఉద్యోగాల భర్తీకి మరో నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం దీనిలో తొమ్మిది ఖాళీలు వున్నాయి. ఆసక్తి, అర్హత వున్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు.
ఇక దీనికి సంబందించి పూర్తి వివరాల లోకి వెళితే… టెక్నికల్ ఆఫీసర్, సైంటిఫిక్ అసిస్టెంట్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. దీనిలో మొత్తం 9 ఖాళీలున్నాయి. హైదరాబాద్లోని ఈసీఐఎల్ యూనిట్లో ఈ ఖాళీలున్నాయి. వివరాలను http://www.ecil.co.in/ వెబ్సైట్లో తెలుసుకోచ్చు. ఆసక్తిగల అభ్యర్థులు ఇదే వెబ్సైట్లో అప్లై చేయాలి. ఇవి ఏడాది గడువున్న కాంట్రాక్ట్ పోస్టులు అని గమనించండి.
అయితే ఆ తరువాత ప్రాజెక్ట్ అవసరాలను బట్టి మీ గడువు పొడిగించే అవకాశం ఉంది. అయితే ఇక అర్హత గురించి చూస్తే… వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలున్నాయి. కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో ఇంజనీరింగ్ డిగ్రీ ఫస్ట్ క్లాస్లో పాస్ కావాలి. సైంటిఫిక్ అసిస్టెంట్ పోస్టుకు డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ ఫస్ట్ క్లాస్లో పాస్ కావాలి. 2021 మార్చి 18 లోగా దరఖాస్తు చేయాలి. ఇక పోస్టుల వివరాల లోకి వెళితే…. టెక్నికల్ ఆఫీసర్- 8, సైంటిఫిక్ అసిస్టెంట్ ఏ- 1. టెక్నికల్ ఆఫీసర్ పోస్టుకు రూ.23,000, సైంటిఫిక్ అసిస్టెంట్ ఏ పోస్టుకు రూ.20,202.