తిరుపతిలోని అలిపిరి వద్ద నారా లోకేష్ నిరసనకు దిగారు. గరుడ విగ్రహం దగ్గర కార్యకర్తలతో కలిసి నారా లోకేష్ బైఠాయించారు. వివేకా హత్య కేసు నిందితులు ఎవరో చెప్పాలంటూ ఆయన డిమాండ్ చేస్తున్నారు. ఈ నిరసనలో అచ్చెన్నాయుడు సహా టీడీపీ నేతలు పాల్గొన్నారు. లోకేష్ ఇక్కడ, జగన్ ఎక్కడ అంటూ టీడీపీ నేతలు నినాదాలు చేస్తున్నారు. వైసీపీ నేతలకు చిత్తశుద్ధి ఉంటే జగన్ ని అలిపిరి తీసుకురావాలని వివేకా హత్య కేసులో సంబంధం లేదని ప్రమాణం చేసేందుకు నేను సిద్ధమని లోకేష్ చెబుతున్నారు.
జగన్ కూడా వస్తే శ్రీవారి సాక్షిగా ఇద్దరూ ప్రమాణం చేయవచ్చని లోకేష్ పేర్కొన్నారు. ఇక మరో పక్క వైఎస్ వివేకా హత్య కేసులో సీబీఐ దూకుడు పెంచింది. హత్య కేసుకు సంబంధించి సీబీఐ అధికారులు నాలుగో రోజు విచారణ జరపనున్నారు. పులివెందులలోని ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్ కేంద్రంగా సీబీఐ అధికారులు వివేకా హత్య కేసుపై విచారణ జరుపుతున్నారు. ఇప్పటికే పలుమార్లు విచారణ జరిపిన అధికారులు.. ఇప్పుడు మరో దఫా విచారణ చేస్తున్నారు.