ఎడిట్ నోట్: ఎన్నికల ‘హీట్’..!

-

లెక్క ప్రకారం చూసుకుంటే ఏపీలో ఎన్నికలకు ఇంకా ఏడాదిన్నర సమయం ఉంది..ఏప్రిల్ 2024లో ఎన్నికలు జరగాలి. అయితే ఇప్పటినుంచే రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతున్నాయా? అనే వాతావరణం ఉంది. అటు అధికార వైసీపీ, ఇటు ప్రతిపక్ష టీడీపీ ఎన్నికలే లక్ష్యంగా రాజకీయం చేస్తున్నాయి. నిత్యం రెండు పార్టీల మధ్య వార్ నడుస్తోంది. ఇక అప్పుడప్పుడు పవన్ కల్యాణ్ ఎంట్రీ ఇచ్చి మరింత హీట్ పెంచుతున్నారు. టోటల్ గా ఏపీలో ఎన్నికల హీట్ మొదలైపోయింది. ప్రతిరోజూ రాజకీయ యుద్ధమే నడుస్తోంది.

ఓ వైపు అసెంబ్లీలో.. మరోవైపు బయట కూడా రెండు పార్టీల మధ్య తీవ్ర స్థాయిలో వార్ నడుస్తోంది. శాసనసభలో గాని, శాసన మండలిలో గాని..రెండు పార్టీల మధ్య టగ్ ఆఫ్ వార్ జరుగుతుంది. అసెంబ్లీలో పూర్తి డామినేషన్ వైసీపీదే ఉంది..కానీ తక్కువ మందే ఉన్నా సరే టీడీపీ ఎమ్మెల్యేలు సైతం గట్టిగా ప్రతిఘటిస్తున్నారు. స్పీకర్ పూర్తిగా మాట్లాడే అవకాశం ఇవ్వకపోయినా…ఇచ్చిన సమయంలోనే వైసీపీని ఇరుకున పెట్టే కార్యక్రమాలు చేస్తున్నారు.

రాష్ట్ర అభివృద్ధి, రాజధాని, ఆర్ధిక పరిస్తితి, అప్పులు, పోలవరం, విద్యా-వైద్య రంగాలకు సంబంధించిన అంశాలపై అసెంబ్లీలో చర్చ జరిగాయి. వీటికి సంబంధించి వైసీపీకి తమకు నచ్చిన విధంగా సమాధానాలు చెప్పుకుంటూ వచ్చింది..అలాగే గంటల తరబడి జగన్ స్పీచ్‌లు ఇస్తూ వచ్చారు. ఈ అంశాలపై వాస్తవ పరిస్తితులు ఏంటి? జగన్ చెబుతుంది ఏంటి? అనే అంశాలని టీడీపీ హైలైట్ చేస్తూ వచ్చింది. అలాగే ఎన్నికల ముందు జగన్ ఏం చెప్పారు..ఇప్పుడు ఏం చేస్తున్నారనే అంశాలని గుర్తు చేస్తున్నారు.

అటు మండలిలో కూడా రెండు పార్టీల మధ్య వాడివేడి చర్చ నడిచింది. ఒకరికొకరు కౌంటర్లు ఇచ్చుకుంటూ ముందుకెళ్లారు. ఇక అసెంబ్లీ బయట కూడా రెండు పార్టీల మధ్య మాటల యుద్ధం నడుస్తుంది..చిత్తూరు జిల్లా పర్యటనకు వెళ్ళిన బాబు..అక్కడ జగన్‌పై తీవ్ర విమర్శలు చేశారు. పోలీసులని అడ్డం పెట్టుకుని అరాచకాలు చేస్తున్నారని, పోలీసులని పక్కన పెట్టి రావాలని సవాల్ చేస్తున్నారు. అలాగే పవన్ సైతం తాజాగా జగన్ టార్గెట్ గా విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే.

దీంతో అటు బాబు, ఇటు పవన్‌లకు కలిపి వైసీపీ కౌంటర్లు ఇచ్చేస్తుంది. అలాగే రాజధానిపై మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఇక డేటా చౌర్యంకు సంబంధించి రచ్చ జరుగుతుంది. అలాగే విజయవాడలోని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరుని వైఎస్సార్ గా మార్చడంపై విమర్శలు వస్తున్నాయి. అటు టీడీపీ-జనసేన పొత్తుకు సంబంధించిన చర్చలు నడుస్తున్నాయి. అలాగే జగన్ కుప్పం టూరుపై మాటల యుద్ధం నడుస్తోంది. ఓవరాల్ గా చూసుకుంటే రాష్ట్రంలో ఇప్పుడే ఎన్నికలు జరుగుతున్నాయా? విధంగా వైసీపీ-టీడీపీల మధ్య రాజకీయం నడుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news