సాయం చేసిన ప్రతిసారీ పొంగిపోతుంది హృదయం. హృదయంలో నిర్మలమయిన భావాలను నింపి వెళ్తుంది పవన్ లాంటి వారు ఇతరులకు అందించే సాయం విషయమై! ఓడి ఏడ్వడం కాదు ఓడి గెలవడంలోనే నిజాయితీ ఉంది. గెలుపునకు అర్థం ఒకరి ఓటమికి అన్ని కుట్రలూ పన్నడం కాదు. నిజాయితీతో యుద్ధం చేసి గెలవడం.
జగన్ అనే లీడర్ నిజాయితీతో యుద్ధం చేయలేదని అంటారు పవన్ అభిమానులు. అందుకే ఆ వేళ తమ నాయకుడు ఓడిపోయాడని కూడా అంటారు. అయినా సరే! పవన్ ఎవ్వరినీ నిందించడు.ఇతరుల ప్రతిభనూ దేశానికి పనికివచ్చే పనులు చేసే వారినీ తప్పక ఆదరిస్తాడు. ఆడ్రా లీడర్ అంటే!జగన్ ఓడించాడు కానీ పవన్ ఓడిపోలేదు ఇప్పటికీ ఎప్పటికీ గెలుస్తూనే ఉన్నాడు ఆ రోజు నుంచి ఈ రోజు వరకూ….
జనసేనకు ఒక్కటంటే ఒక్క టికెట్ మాత్రమే వచ్చింది సర్..అయితేనేం వారు కూడా ఆయన దగ్గర లేరు.అయినా కూడా ఇతరులకు సాయం చేయడంలో ఎప్పుడూ ముందుంటారు.ఓటు బ్యాంకు రాజకీయాల్లో భాగంగా జగన్ దగ్గరుండి పవన్ ను ఓడించాడు.అందుకు పవన్ పోటీచేసిన ఒక్కో నియోజకవర్గంలో (భీమవరం మరియు గాజువాక) 150 కోట్ల రూపాయల చొప్పున 300 కోట్ల రూపాయలు వెదజల్లాడు.
కానీ పవన్ నన్ను నమ్మి ఓటేయండి అని మాత్రమే చెప్పాడు. నోట్ల పంపకం వద్దనే చెప్పి వెళ్లాడు.ఒకవేళ కింది స్థాయి నాయకులు అటువంటి పనులు చేద్దాం అని అత్యుత్సాహం చూపితే వద్దని వారించాడు. గెలిస్తే గెలుస్తాను లేకుంటే లేదు అనే చెప్పాడు. అది రా పవన్ .. అందుకే ఆయనంటే ఇరు రాష్ట్రాలకూ ఎంతో ఇష్టం. జగన్ కన్నా మంచి లీడర్ పవన్. కానీ దౌర్భాగ్యం ప్రజలే ఓడిపోయి జగన్ ను మాత్రం గెలిపించుకున్నారు అన్నదే ఓ వాస్తవం అన్నది ఇవాళ్టి సత్యం.
ఆడెప్పుడూ అంతే! సాయం చేస్తూనే ఉంటాడు. డబ్బులు ఉన్నా లేకపోయినా ఎవరికో ఒకరికి అండగా ఉండడం అన్నది మన ప్రథమ కర్తవ్యం కావాలనే అంటాడు. వావ్ ! ఇదే కోవలో క్రికెటర్ రషీద్ కు రెండు లక్షల రూపాయల సాయం చేశాడు. తన తరఫున చెక్కు అందజేయాలని గుంటూరు జనసేన నాయకుడు మార్కండేయంను ఆదేశించి, సంబంధిత చెక్కు అందించాడు. అరేయ్ ఈ దేశంలో ఇలాంటి నాయకుడు ఒక్కడున్నాడ్రా! దటీజ్ పవన్.