ఇవాళ తెలంగాణలో విద్యాసంస్థలు బంద్ !

-

రంగారెడ్డి జిల్లా నార్సింగిలోని శ్రీ చైతన్య కళాశాలలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థి సాత్విక్ ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. అయితే సాత్విక్ జేబులో పోలీసులు సూసైడ్‌ నోట్‌ను గుర్తించారు. ‘‘ అమ్మా నాన్న.. నేను ఈపని చేస్తున్నందుకు క్షమించండి. మిమ్మల్ని బాధ పెట్టాలనే ఉద్దేశం నాకు లేదు. ప్రిన్సిపల్‌, ఇన్‌ఛార్జి, లెక్చరర్ల వల్లే చనిపోతున్నా.

కృష్ణారెడ్డి, ఆచార్య, శోభన్‌, నరేశ్‌ వేధింపులు తట్టుకోలేకపోతున్నా. ఈ నలుగురు హాస్టల్‌లో విద్యార్థులకు నరకం చూపిస్తున్నారు. నన్ను వేధించిన ఆ నలుగురిని వదిలిపెట్టొద్దు.. చర్యలు తీసుకోండి. అమ్మా, నాన్న లవ్‌ యూ, మిస్‌ యూ ఫ్రెండ్స్‌’’ అని సాత్విక్‌ సూసైడ్‌ నోట్‌ లో పేర్కొన్నాడు. అయితే, సాత్విక్‌ మృతికి నిరసనగా ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా ఉన్న శ్రీ చైత న్య విద్యాసంస్థల బంద్‌ కు ఎన్‌ఎస్‌యూఐ పిలుపునిచ్చింది. శ్రీ చైతన్య విద్యాసంస్థల యాజమాన్యం ఒత్తిడితోనే సాత్విక్‌ సూసైడ్‌ చేసుకున్నాడని బల్మూర్‌ వెంకట్‌ ఆరోపణ లు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news