నేడు హైదరాబాద్‌లో టీ-వర్క్స్‌ ప్రారంభోత్సవం

-

హైదరాబాద్‌ మహానగరం మరో ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టుకు ఊపిరిపోస్తోంది. వినూత్న ఆవిష్కరణలు చేసే ఔత్సాహికులకు ఓ వేదికను అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం టీ-వర్క్స్ ను ఏర్పాటు చేసింది. హైదరాబాద్ రాయదుర్గంలో 78 వేల చదరపు అడుగులలో నిర్మించిన T-వర్స్క్ భవనాన్ని ఫాక్స్‌కాన్ సంస్థ చైర్మన్ యాంగ్ లియూ ఇవాళ ప్రారంభించనున్నారు.

సంకలిత ప్రోటోటైపింగ్, ఎలక్ట్రానిక్స్ వర్క్‌స్టేషన్, ఫినిషింగ్ షాప్, లేజర్ కటింగ్, పీసీబీ ఫాబ్రికేషన్, కుండల తయారీ, ప్రీ-కంప్లైయన్స్, మెటల్‌షాప్‌ వంటి అత్యాధునిక సాంకేతికతలు ఇక్కడ అందుబాటులో ఉంచారు. సాఫ్ట్‌వేర్ రంగాన్ని అభివృద్ధి చేసేందుకు ఇప్పటికే టీ-హబ్ ఉండగా…. హార్డ్‌వేర్‌కు సంబంధించి టీ-వర్స్క్ పనిచేస్తుందని సీఈవో సుజయ్ కారంపురి అన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం టీ-వర్క్స్‌లో సుమారు 100 కోట్ల పెట్టుబడి పెట్టినట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. టీ-వర్క్స్‌ ఇవాళ ప్రారంభంమవుతున్నప్పటికీ.. గత ఏడాదే సాఫ్ట్‌ లాంచ్ అయ్యింది. ఇప్పటికే ఇందులోని ఆవిష్కరణలు అందరినీ ఆకట్టుకున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news